సీమ మొత్తం సైకిల్ సీన్ ఇలాగే ఉంటే?
ఏమాత్రం బాగా లేదు. అనుకున్నది రివర్స్ అవుతుంది. జగన్ రివర్స్ షాట్ చంద్రబాబుకు తగిలింది. రాయలసీమలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని పంచాయతీ ఎన్నికలు మరింత [more]
ఏమాత్రం బాగా లేదు. అనుకున్నది రివర్స్ అవుతుంది. జగన్ రివర్స్ షాట్ చంద్రబాబుకు తగిలింది. రాయలసీమలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని పంచాయతీ ఎన్నికలు మరింత [more]
ఏమాత్రం బాగా లేదు. అనుకున్నది రివర్స్ అవుతుంది. జగన్ రివర్స్ షాట్ చంద్రబాబుకు తగిలింది. రాయలసీమలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని పంచాయతీ ఎన్నికలు మరింత ప్రమాదంలో పడేశాయనే చెప్పాలి. రాయలసీమలో ఏ జిల్లాలో చూసినా టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికల కోసం బయటకు రాలేదు. ఆర్థికంగా అభ్యర్థులను ఆదుకోలేదు. ఫలితంగా కొన్ని ఏకగ్రీవం కాగా, మరికొన్నింటిలో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.
గత ఎన్నికల్లోనే…..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలో రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మినహా ఎవరూ గెలవలేదు. ఇంత దారుణంగా పార్టీ ఓడటంతో చంద్రబాబు ఈ ప్రాంతాలపై గత కొన్ని రోజులుగా దృష్టి పెట్టారు. పార్టీ కమిటీల్లోనూ సీమ ప్రాంత నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి తెలుగు యువత అధ్యక్షుడి వరకూ రాయలసీమ నేతనే నియమించారు.
ఆర్థికంగా ఇబ్బందులేనా?
అయితే హేమాహేమీలు రాయలసీమ జిల్లాల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పెద్దగా పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదంటున్నారు. ఇందుకు ప్రధానంగా ఆర్థికంగా అభ్యర్థులకు సర్దుబాటు చేయాల్సి వస్తుందన్నది ఒక కారణమైతే, అనవసర కేసులు నమోదవుతాయన్నది మరో భయం. ఫలితంగా అభ్యర్థులు అనేక చోట్ల ఉన్నా ఆర్థికంగా తట్టుకోలేక కొందరు పోటీ చేయకపోగా, మరికొందరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారంటున్నారు.
హేమాహేమీలున్నా…..
రాయలసీమలో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు, కాల్వ శ్రీనివాసులు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, భూమా ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉద్దండులున్నా కీలక సమయంలో చేతులెత్తేశారంటున్నారు. ఇదే పంథాను సీమలో నేతలు కొనసాగిస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం మాట అటుంచి పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రాయలసీమలో నిలదొక్కుకునేందుకు చంద్రబాబు మరో వ్యూహాన్ని రచించుకోవాల్సిందే. లేకుంటే మరోసారి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.