టీడీపీ గాయబ్ కావడానికి కారణాలివేనట
ఎక్కడైనా నాయకత్వం బలంగా ఉంటేనే క్యాడర్ ధైర్యంగా ఉంటుంది. లీడర్ ధైర్యంగా ముందుకు వెళితే దూకే క్యాడర్ అన్ని పార్టీల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో [more]
ఎక్కడైనా నాయకత్వం బలంగా ఉంటేనే క్యాడర్ ధైర్యంగా ఉంటుంది. లీడర్ ధైర్యంగా ముందుకు వెళితే దూకే క్యాడర్ అన్ని పార్టీల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో [more]
ఎక్కడైనా నాయకత్వం బలంగా ఉంటేనే క్యాడర్ ధైర్యంగా ఉంటుంది. లీడర్ ధైర్యంగా ముందుకు వెళితే దూకే క్యాడర్ అన్ని పార్టీల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో పార్టీ కంటే నాయకుల బలంతోనే పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అయితే పార్టీల కంటే నేతల మొహం చూసే క్యాడర్ పరుగులు పెడుతుంది. రాయలసీమలో టీడీపీకి అనేక మంది నేతలున్నారు. భూమా కుటుంబం, కోట్ల, కేఈ, పరిటాల, జేసీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు.
నాయకులే ప్రధానం…..
ఇక్కడ పార్టీ గుర్తుల కన్నా లీడర్ల ఫొటోలనే క్యాడర్ తమ వెంట ఉంచుకుంటుంది. ఆ నాయకులు ఏ పార్టీ మారినా వారికి సంబంధం లేదు. తమ నేత వెంట నడవడమే వారి పని. అలాంటి సీమ జిల్లాల్లో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారయింది. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ పెద్దదిక్కు కోల్పోయినట్లయింది. ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా కుటుంబానికి పట్టున్నా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు.
నేతలే చేతులెత్తేయడంతో…..
ఇక డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోనూ కేఈ కుటుంబం చేతులెత్తేసింది. అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలను ఎన్నికలకు ముందే వదిలేసుకుంది. కొద్దోగొప్పో ఆలూరు వంటి నియోజకవర్గంలో కోట్ల కుటుంబం తన పట్టును నిలబెట్టుకోగలిగిందనే చెప్పాలి. ఇక అనంతపురం జిల్లాలను తీసుకుంటే జేసీ బ్రదర్స్ వరస కేసులతో సతమతమవుతున్నారు. పంచాయతీలన్నీ ప్రత్యర్థికి అప్పగించేశారు. మున్సిపాలిటీలు వస్తాయన్న నమ్మకం లేదు.
ఆర్థిక ఇబ్బందులు, కేసుల భయం….
పేరున్న పరిటాల ఫ్యామిలీ రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికలకు ముందుగానే హ్యాండ్సప్ అనేసింది. పేరున్న నేతల ఇలాకాలోనే టీడీపీకి చేదు అనుభవం ఎదురయింది. అనేక మంది నమ్మకమైన కిందిస్థాయి నేతలు టీడీపీని వదిలి వైసీపీలో చేరిపోయారు. అంటే నాయకులే పూర్తిగా పార్టీని వదిలేశారని అర్ధమవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు కేసుల భయంతో ఎన్నికలను వదిలేయడంతోనే టీడీపీ అభాసుపాలయిందంటున్నారు. మరి భవిష్యత్ లో నైనా పార్టీ సీనియర్ నేతలు యాక్టివ్ అవుతారో? లేదో చూడాలి.