ఇక్కడ తేల్చకుంటే ఇక అంతే సంగతులట
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తేల్చాలంటూ.. మళ్లీ టీడీపీలో డిమాండ్ లు వినిపిస్తున్నాయి. “ప్రస్తుతం అధికార పార్టీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తేల్చాలంటూ.. మళ్లీ టీడీపీలో డిమాండ్ లు వినిపిస్తున్నాయి. “ప్రస్తుతం అధికార పార్టీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తేల్చాలంటూ.. మళ్లీ టీడీపీలో డిమాండ్ లు వినిపిస్తున్నాయి. “ప్రస్తుతం అధికార పార్టీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. మేం పుంజుకునేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు కనుక ఏదో ఒకటి తేల్చేస్తే.. మేం రంగంలోకి దిగిపోతాం. మా పరిస్థితిని అంచనావేసుకుని ఆమేరకు పుంజుకునే ప్రయత్నం చేస్తాం. సో.. ఏదో ఒకటి తేల్చండి“ అంటూ.. ఓ మాజీ ప్రతినిధి టీడీపీలో సీనియర్లకు ఫోన్ లు చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో దివంగత స్పీకర్ కోడెల కుమారుడు కోడెల శివరామకృష్ణకూడా ఈ సీటు కోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు.
ఎవరికివ్వాలన్న దానిపై?
అయితే.. ఇక్కడ కోడెల కుమారుడికి ఇవ్వాలా ? లేక మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఆశిస్తున్నట్టు ఆయనకు పగ్గాలు ఇవ్వాలా ? అనే సందేహంలో టీడీపీ అధిష్టానం ఇబ్బంది పడుతోంది. ఒకవైపు రాష్ట్రంలో ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న ఎన్నికలు.. మరోవైపు పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఏది ముందు అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి ఆశావహుల పరిస్థితిని ఇప్పట్లో తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని నాన్చడం వల్ల కూడా పార్టీకి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి తేలిస్తే.. అక్కడైనా.. పార్టీ పుంజుకుంటుందని చెబుతున్న వారు కూడా ఉన్నారు.
మరీ దారుణంగా….?
ప్రస్తుతం సత్తెనపల్లిలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందనేది వాస్తవం. ఇక్కడ పార్టీ జెండా కనిపించడం లేదు. పార్టీ నేత మాట కూడా వినిపించడం లేదు. ఇదే పరిస్థితి మరో ఏడాది పాటు ఉంటే.. పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదని సీనియర్లు కూడా అంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో మహామహులు అయిన నేతలు ఉన్న నియోజకవర్గాల్లోనే పార్టీ చేతులు ఎత్తేసింది. సత్తెనపల్లిలో నేతలు లేకుండానే పార్టీ ఉన్నంతలో ఎక్కువ శాతం ఓట్లు రాబట్టడంతో పాటు కొన్ని చోట్ల సంచనల విజయాలు నమోదు చేసింది.
నాన్చకుండా..?
కోడెల శివరాంకు ఇవ్వకుండా ఆ సీనియర్ మాజీ ప్రజా ప్రతినిధి కుటుంబానికి పగ్గాలు ఇస్తే కోడెల కుటుంబాన్ని బాబు పక్కన పెట్టేశారా ? అన్న సందేహాలు వెళతాయనే ఇక్కడ ఏం తేల్చడం లేదు. ఈ క్రమంలో బాబు సత్తెనపల్లి పార్టీ పగ్గాల విషయంపై నాన్చకుండా… ఏదో ఒకటి తేల్చేస్తే.. ఎవరో ఒకరు ఇక్కడ పార్టీ బాధ్యతలు చూసుకుంటారని.. తద్వారా పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ముగిసిన తర్వాత.. దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉందని.. సీనియర్ల నుంచి తెలుస్తోంది. మరి ఎవరికి ఇక్కడ అవకాశం ఇస్తారో చూడాలి.