బంగ్లా రాజకీయాలు చెల్లేనా?
రాష్ట్రంలో ఇప్పటికే చిత్తుగా ఓటమిపాలైన టీడీపీ పుంజుకునే ప్రయత్నాలుచేస్తున్నా పెద్దగా ఫలించ డం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఉద్యమాలు చేస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా [more]
రాష్ట్రంలో ఇప్పటికే చిత్తుగా ఓటమిపాలైన టీడీపీ పుంజుకునే ప్రయత్నాలుచేస్తున్నా పెద్దగా ఫలించ డం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఉద్యమాలు చేస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా [more]
రాష్ట్రంలో ఇప్పటికే చిత్తుగా ఓటమిపాలైన టీడీపీ పుంజుకునే ప్రయత్నాలుచేస్తున్నా పెద్దగా ఫలించ డం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఉద్యమాలు చేస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా వాటి ని ప్రజలు లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఇలావుంటే, జిల్లాల స్థాయిలో కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. చాలా వరకు జిల్లాల్లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వంటి విజయనగరంలో ఇప్పుడు పార్టీని పట్టించుకునే నాధుడే లేకపోవడం గమనార్హం.
పెద్దదిక్కుగా ఉండాల్సిన….
విజయనగరం జిల్లాలో పార్టీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వయసు మీరడంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. అశోక్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక ఆయన రాజకీయాలకు దాదాపు దూరమైనట్టే. అశోక్ ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా వేగంగా ఉండకపోవడంతో పాటు ఆ పాతకాలపు బంగ్లా రాజకీయాలే చేస్తుండడంతో ఆయన చాలా మందికి దూరమవుతున్నారు.
సుజయ కూడా….
దీంతో పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యారు. పోనీ గత ఏడాది ఎన్నికల సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన అశోక్ కుమార్తె అథితి గజపతిరాజు ఏమన్నా యాక్టివ్ గా ఉన్నారా? అంటే కుటుంబ కట్టుబాట్ల నేపథ్యంలో ఆమె కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఫలితంగా విజయనగరంలో పార్టీ పరిస్థితి ఈసురోమంటోంది. ఇక, ఉన్నవారిలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు పేరుకే టీడీపీలో ఉన్నారు. ఆయన వ్యాపారాల్లోనే పూర్తికాలం గడుపుతున్నారు. ఇక, ఆయన సోదరుడు బేబినాయన దూకుడుగానే ఉన్నా పార్టీ ఈయనకు పదవి ఇస్తుందా? బాధ్యతలు అప్పగిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బేబినాయనే బెటరంటూ….
జిల్లాలో బీసీలకు ప్రయార్టీ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో వెలమ వర్గానికి చెందిన బేబీ నాయనకు పార్టీ పగ్గాలు ఇవ్వడం కష్టమే. ఇక గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కోళ్ల అప్పలనాయుడు ఉరఫ్ కేఏ నాయుడు జిల్లా ఇంచార్జ్ పదవిని ఆశిస్తున్నారు. అయితే, ఈయనకు ఇస్తే పార్టీలో అసమ్మతి చెలరేగి.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు. ఆయన పదవి ఆశిస్తున్నా సొంత అన్నతోనే ఆయనకు పొసగని పరిస్థితి ఉంది. ఇక, మరో నేత ద్వారపురెడ్డి జగదీష్ రెడ్డి ఉన్నా కూడా ఆయనంటే కూడా బేబినాయనే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది.
క్యాస్ట్ ఈక్వేషన్లు…..
అయితే, ఈయనకు ఇచ్చేందుకు క్యాస్ట్ ఈక్వేషన్లు అడ్డువస్తున్నాయని అంటున్నారు. మరి ఇక్కడ టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే జిల్లాలో వైసీపీ చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సహా ఆయన వర్గం పార్టీని ముందుకు తీసుకువెళ్తోంది. బొత్స పొలిటికల్ చాణుక్యానికి తోడు ఆయన బంధువు చిన్న శీను రాజకీయ చతురతతో జిల్లా అంతటా వైసీపీకి తిరుగులేకుండా పోతోంది. చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి కేడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతున్నా టీడీపీలో ఈ వలసలు ఆపే పరిస్థితి లేదు. మరి ఈ పోటీని తట్టుకుని టీడీపీ ఎలా ఎదుగుతుందో ? చూడాలి.