టీడీపీలో కొత్త రగడ.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే..!
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో కొన్నాళ్లుగా రగులుతున్న [more]
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో కొన్నాళ్లుగా రగులుతున్న [more]
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో కొన్నాళ్లుగా రగులుతున్న మేయర్ పీఠం వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఆశించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి.. అనురాధ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. ఈ పీఠాన్ని విజయవాడ ఎంపీ కేశినేనినాని కుమార్తె శ్వేతకు ఇస్తారని ఆ వర్గం నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్వేత లాక్డౌన్ పరిస్థితులను గమనించేందుకు విజయవాడలో పర్యటించారు.
మేయర్ పదవి విషయంలో….
ఈ సందర్భంగా కొందరు కేశినేని అభిమానులు కాబోయే మేయర్ అంటూ.. శ్వేతను ఉద్దేశించి నినాదాలు చేశారు. ఈ నినాదాలు పార్టీలో వివాదాలకు దారితీశాయి. విజయవాడలోని కీలక ప్రాంతం అందునా తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బెంజి సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమానికి శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భం గా కొందరు ఎంపీ అనుచరులు కాబోయే మేయర్ శ్వేత.. జిందాబాద్ అంటూ.. స్లోగన్లు ఇచ్చారు. ఈ విషయం గద్దె రామ్మోహన్‌కు ఆయన సతీమణికి తెలిసింది. దీంతో ఈ విషయంపై విజయవాడ నగర టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్నకు వారు ఫిర్యాదు చేశారు. “మీరు మేయర్ విషయంలో క్లారిటీ ఇవ్వండి“ అంటూ.. ప్రశ్నించినట్టు తెలిసింది.
ఆయనకు ఫిర్యాదు చేయడంతో….
దీంతో ఈ వివాదం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్న కోర్టులోకి చేరింది. వాస్తవానికి ఎంపీ నానికి, బుద్దా వెంకన్నకు మధ్య వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల పాటు ఇరువురు కూడా తీవ్ర విమర్శలు చేసు కున్న విషయం తెలిసిందే. అసలు బుద్ధా వెంకన్నను నగర అధ్యక్షుడు చేయాలని ముందుగా పట్టుబట్టిందే కేశినేని నాని. ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడడంతో కొబ్బరిచిప్పల దొంగ, సైకిల్ బెల్లుల దొంగలు అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ విషయంలో ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. చివరకు చంద్రబాబు చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇక ఇప్పుడు నానిపై కంప్లైంట్ బుద్ధాకు రావడంతో ఆయన డోలయామానంలో ఉన్నారట.
ఇద్దరి మధ్య వివాదం…..
ఈ నేపథ్యంలో ఆయన ఈ వివాదంలో వేలు పెట్టాలా? లేక టీడీపీ అధినేత దృ ష్టికి తీసుకువెళ్లాలా అనే సందిగ్ధంలో ఉన్నారని సమాచారం. ఇక, ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా మేయర్ పదవి విషయం తెరమీదికి వచ్చిన నాటి నుంచి ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. గతంలో ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేసేవారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయానా వీరిద్దరు గెలవడంతో తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు సమన్వయంతో ఉండేవారు. ఇక ఎంపీ నిధులు కూడా నాని ఇక్కడే ఎక్కువుగా ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడం… మేయర్ వివాదం తర్వాత ఎమ్మెల్యే గద్దె తన కార్యక్రమాలకు ఎంపీని పిలవడం లేదు. ఇక, ఎంపీ నాని ఎక్కడా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఎంత దూరం వెళ్తుందోనని టీడీపీలో బహిరంగంగానే చర్చ జరుగుతుండడం గమనార్హం.