Tdp : బెజవాడ టీడీపీ బాగుపడేదెప్పుడు?
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా అంతర్గత కుమ్ములాటలో మాత్రం ముందుందనే చెప్పాలి. బెజవాడ టీడీపీ ఎప్పుడూ కలసికట్టుగా లేదు. టీడీపీలోనే రెండు సామాజికవర్గాలుగా విడిపోవడం ఆ పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా అంతర్గత కుమ్ములాటలో మాత్రం ముందుందనే చెప్పాలి. బెజవాడ టీడీపీ ఎప్పుడూ కలసికట్టుగా లేదు. టీడీపీలోనే రెండు సామాజికవర్గాలుగా విడిపోవడం ఆ పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా అంతర్గత కుమ్ములాటలో మాత్రం ముందుందనే చెప్పాలి. బెజవాడ టీడీపీ ఎప్పుడూ కలసికట్టుగా లేదు. టీడీపీలోనే రెండు సామాజికవర్గాలుగా విడిపోవడం ఆ పార్టీ మరింత బలహీనమవుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం అవసరం లేదు. బెజవాడలో టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఒకప్పుడు బెజవాడలో కమ్యునిస్టుల ఆధిపత్యం కొనసాగేది. కానీ తర్వాత అది టీడీపీకి డైవర్ట్ అయింది.
ఎన్నికల తర్వాత….
2019 ఎన్నికల్లోనూ టీడీపీ విజయవాడ తూర్పు నియోజకరవర్గంతో పాటు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడానికి బెజవాడలో టీడీపీ బలాన్ని చెప్పకనే చెప్పింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కలసి కట్టుగా ఉండాల్సిన బెజవాడ నేతలు కట్టుతప్పుతున్నారు. కేశినేని వర్సెస్ బెజవాడ నేతలుగా సీన్ మారిపోయింది. కార్పొరేషన్ ఎన్నికల్లోనే ఈ విభేదాలు బయటపడినా విజయవాడ టీడీపీ కమిటీ నియామకం మరోసారి అసంతృప్తులను రాజేసింది.
యాంటీ నాని….
బెజవాడ పట్టణంపై బుద్దా వెంకన్న, బొండా ఉమ లదే ఆధిపత్యం. వీరికే ఎక్కువ చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె శ్వేత ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో విభేదాలు మరింత ముదిరాయి. నిధులు ఖర్చు పెట్టుకుంటారనే కేశినేనికి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో కేశినేని నాని సైలెంట్ అయ్యారు. అయితే తిరిగి చంద్రబాబు కేశినేని నానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు.
సమయం వచ్చినప్పుడు….
టీడీపీ బెజవాడ కమిటీలో నాని వర్గీయులకు చంద్రబాబు పెద్ద పీట వేశారు. దీంతో బుద్దా, బొండా వర్గాలు రగిలిపోతున్నాయి. అయితే ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేసినా ఫలితం లేదు. అసలే పార్టీ కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును చికాకు పెడితే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ప్రస్తుతానికి అసంతృప్తిని వారు అణుచుకున్నారు. సమయం వచ్చినప్పుడు తమ తడాఖా చూపించాలన్న ధోరణిలో బెజవాడ నేతలున్నారు. మొత్తం మీద బెజవాడ టీడీపీ బాగుపడే అవకాశాలు లేవు.