ఉండేదెవరు..? వెళ్లేదెవరు? రోజుకొకరు..మిగులుతారా?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నచందంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ఎఫెక్ట్ నుంచి పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ [more]
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నచందంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ఎఫెక్ట్ నుంచి పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ [more]
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నచందంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ఎఫెక్ట్ నుంచి పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబుకు కలిసి వస్తున్న అంశాలు ఏవీ కూడా కనిపించడం లేదు. దీంతో పార్టీ ఇబ్బందులు పడుతూనే ఉంది. ముఖ్యంగా విశాఖ వంటి కీలకమైన జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ సైకిల్ పరుగులు పెట్టింది. అయితే, ఆ ఆనందం మాత్రం ఎంతో కాలం నిలవకుండానే నగర పార్టీ అధ్యక్షుడు రెహమాన్ కొన్ని రోజుల కిందట పార్టీ మారిపోయారు.
పంచకర్ల రాజీనామాతో….
దీని నుంచి తేరుకుని వేరేవారికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే సరికి ఇప్పుడు మరో సంచలనం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా టీడీపీ అద్యక్షుడుగా ఉన్న పంచకర్ల రమేశ్ బాబు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రమేశ్‌బాబు పేర్కొన్నారు. అంతేకాదు, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడాన్ని తనతో పాటు చాలామంది జిల్లా నాయకులు స్వాగతించారన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు ఏమీ చేయలేదన్నారు.
మనసు బాధ కలిగి…
దీనిని మనసులో ఉంచుకొని అధిష్ఠానం తనను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీ ఫారాలు పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా పంపిణీ చేయాల్సి ఉందన్నారు. విశాఖ నగరంలో వాసుపల్లి గణేష్‌కుమార్ ఇస్తున్నారని, రూరల్‌లో తనకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆ బాధ్యత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు అప్పగించిం దన్నారు. ఇది తన మనసుకు బాధ కలిగించిందన్నారు. అదే విధంగా ఎలమంచిలి నియోజక వర్గానికి తాను ఇన్చార్జిగా వుండగా, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తనకు మాట మాత్రం చెప్పకుండా అక్కడ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఇద్దరు రాజీనామాతో….
ఇక 2009లో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం తరపున గెలిచిన పంచకర్ల ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి యలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన ఆయనకు ఇప్పుడు పార్టీలో ప్రయార్టీ లేకుండా పోయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై ఇప్పటివరకు చంద్రబాబునాయుడు సరైన సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మొత్తంగా చూస్తే.. అటు నగర, ఇటు జిల్లా అధ్యక్షులు ఖాళీ అవడంతో పార్టీ బాధ్యతలు ఎవరు మోస్తారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.