టీడీపీకి షాక్ ఇచ్చేశారు… ?
విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ అధికారంలో ఉంది. దాంతో పాటుగానే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కూడా ముప్పై వార్డులను గెలుచుకుంది. అయితే ఇందులో ఒకరు చనిపోగా మరో [more]
విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ అధికారంలో ఉంది. దాంతో పాటుగానే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కూడా ముప్పై వార్డులను గెలుచుకుంది. అయితే ఇందులో ఒకరు చనిపోగా మరో [more]
విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ అధికారంలో ఉంది. దాంతో పాటుగానే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కూడా ముప్పై వార్డులను గెలుచుకుంది. అయితే ఇందులో ఒకరు చనిపోగా మరో కార్పోరేటర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే మరికొంతమంది కార్పోరేటర్లు వైసీపీలోకి జంప్ చేస్తారు అన్న ప్రచారం అయితే ఇంతకాలం సాగింది. దానిని నిజం చేస్తూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా ఏకంగా నలుగురు టీడీపీ కార్పోరేటర్లు గీత దాటేశారు. దాంతో వారిని ఏం చేయాలో తెలియక టీడీపీ మదన పడుతోంది.
క్రాస్ ఓటింగ్ తో …?
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఆ టీడీపీ కార్పోరేటర్లు వైసీపీకి క్రాస్ ఓటింగ్ చేశారు అని పార్టీలో చర్చ సాగుతోంది. వీరి మీద చర్య తీసుకుంటారా లేదా అన్నది కూడా అర్ధం కావడంలేదు. ఎందుకంటే చర్యలు తీసుకుంటే వారు పూర్తిగా టీడీపీకి దక్కకుండా పోతారు. అంతే కాదు అదే బాటలో మరింతమంది వెళ్ళేలాగా ఉన్నారని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం చూస్తూంటే ఉన్న వారిలో కనీసం మూడవ వంతు మంది పార్టీకి హ్యాండ్ ఇచ్చేలాగానే ఉన్నారని అంటున్నారు.
కొనేస్తున్నారా…?
దీని మీద టీడీపీ నాయకులు అయితే వైసీపీ పెద్దలను టార్గెట్ చేస్తున్నారు. తమ కార్పోరేటర్లను లాగేసుకుంటున్నారు అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ అయితే గట్టిగానే ఆరోపిస్తున్నారు. ఇది మంచి విధానం కాదని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే తమకు పూర్తి బలం ఉంది. అలాంటి అవసరం ఏంటి అని వైసీపీ పెద్దలు రివర్స్ లో అటాక్ చేస్తున్నారు. టీడీపీ నేతలు తమ పార్టీని చక్కదిద్దుకోలేక తమ మీద పడుతున్నారని కూడా వారు తిప్పికొడుతున్నారు.
ఎలా అయిపోయింది …?
విశాఖ సిటీలో టీడీపీ బలంగా ఉండేది. కానీ గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు ఆ పార్టీని బాగా బలహీనం చేశాయనే చెప్పాలి. ఇక సిటీలో సరైన దిశా నిర్దేశం చేసే నాయకత్వం కూడా లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇంకో వైపు వైసీపీ అధికారంలో ఉండడం, జీవీఎంసీ లో కూడా వారే పవర్ లో ఉండడంతో టీడీపీ కార్పోరేటర్లు ఆకర్షితులు అవుతున్నారు అంటున్నారు. మూడున్నర దశాబ్దాల నుంచి విశాఖ కార్పోరేషన్ లో ఎపుడూ ప్రతిపక్షంలోనే ఉండడంతో తాము అభివృద్ధి పనులు చేసుకోలేకపోతున్నామని చాలా మంది గోల పెడుతున్నారు. ఇలా చాలా కారణాలతోనే టీడీపీ నుంచి కార్పోరేటర్లు జారిపోతున్నారు అంటున్నారు. మొత్తానికి విశాఖ సిటీలో టీడీపీ ఎన్నడూ లేనంత దైన్యంలో ఉందని చెప్పాలి.