వెస్ట్ ది వరెస్ట్ అటగా
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోటే. పార్టీ పుట్టినప్పటి నుంచి స్టేట్లో ఓడినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జిల్లాలో [more]
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోటే. పార్టీ పుట్టినప్పటి నుంచి స్టేట్లో ఓడినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జిల్లాలో [more]
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోటే. పార్టీ పుట్టినప్పటి నుంచి స్టేట్లో ఓడినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జిల్లాలో మాత్రం టీడీపీ సత్తా చాటేది. కొన్ని ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు క్వీన్స్వీప్ చేసిన టీడీపీ, కొన్ని ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థి కాంగ్రెస్ను ఒక్క సీటుతో సరిపెట్టుకునేలా చేసింది. 2014లో జిల్లా అంతటా టీడీపీ సునామి వీచింది. వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అలాంటి జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు, కేడర్ తీరుతో విసిగిపోయిన ఓటర్లు ఈ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. టీడీపీ కేవలం పాలకొల్లు, ఉండి సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్, మాగంటి రూపాదేవి, వంగలపూడి అనిత, బూరుగుపల్లి శేషారావు లాంటి సీనియర్ నేతలు అంతా మట్టికరిచారు.
ఏడు నెలలు తర్వాత…..
ఎన్నికల్లో ఓడిపోయి ఏడు నెలలు అయ్యిందో లేదో జిల్లాలో టీడీపీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసేవాళ్లు, ఇన్చార్జ్లు లేని పరిస్థితి. ముందుగా కొవ్వూరులో ఎక్కడో విశాఖ నుంచి తీసుకువచ్చి పోటీ చేయించిన మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అడ్రస్ లేకుండా పోయింది. ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కొవ్వూరు వైపే చూడడం లేదు. తనకు తిరిగి పాయకారావుపేట సీటు ఇవ్వాలని అక్కడకు వెళ్లిపోయారు. ఇక తిరిగి కొవ్వూరు వచ్చేందుకు మాజీ మంత్రి జవహర్ ప్రయత్నాలు చేస్తున్నా స్థానిక టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. దీంతో జవహర్ తిరువూరులో ఉండలేక.. కొవ్వూరుకు ఎప్పుడు వచ్చేద్దామా అన్న ప్రయత్నాల్లో ఉన్నారు.
బలమైన నేతలు…
ఇక భీమవరంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దాదాపు రాజకీయాలకు దూరమైనట్టే అంటున్నారు. ఆయన అస్సలు టీడీపీ అంటే తనకెంత మాత్రం పట్టనట్టుగా ఉంటున్నారు. అంజిబాబు గంటా వియ్యంకుడు కావడంతో ఆయన టీడీపీకి దూరం దూరం అన్నట్టుగా ఉన్నారు. దీంతో భీమవరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇటీవలే మృతి చెందడంతో అసలు పార్టీ తరపున బుజ్జి స్థాయి బలమైన నేత ఎవ్వరూ కనపడడం లేదు. బుజ్జి లేని లోటు టీడీపీకి తీర్చలేనిది.
ఎవరికి వారే….
మెట్ట ప్రాంతంలో ఉన్న చింతలపూడి, పోలవరం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఇన్చార్జ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది. చింతలపూడి కన్వీనర్ కర్రా రాజారావు వయస్సు పైబడడంతో ఆయన యాక్టివ్గా ఉండడం లేదు. నియోజకవర్గంలో ఉన్న గ్రూపు రాజకీయాలను ఆయన పరిష్కరించడం కలే. అసలు వచ్చే ఎన్నికల వరకు ఆయన్ను ఇన్చార్జ్గా ఉంచే పరిస్థితులు కనపడడం లేదు. పోలవరంలో బొరగం శ్రీనివాసరావు ఉన్నా నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన బొరగం ఏటికి ఎదురీదుతున్నారు.
ఆయన తప్పుకుంటే…?
తాడేపల్లిగూడెంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైసీపీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో నాని పార్టీకి దూరమైనట్టు చర్చలు నడుస్తున్నాయి. అసలే గూడెంలో పార్టీ జెండా ఎగిరి 20 ఏళ్లు దాటింది. ఇప్పుడు అక్కడ పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్టే కనపడుతోంది. ఇక ఏలూరు ఎంపీగా పోటీ చేసిన మాగంటి బాబు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే. ఆయన తప్పుకుంటే ఏలూరు పార్లమెంటు పరిధిలో పార్టీని ముందుండి నడిపించే బలమైన నేత కొరత ఏర్పడినట్టే..?
జెండా మోసే వారు లేక….
ఇక రాజమహేంద్రవరం ఎంపీగా ఓడిన మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి సైతం రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. గత దశాబ్దంన్నర కాలంగా ఈ ఫ్యామిలీ ఈ లోక్సభ పరిధిలో ఎంతో కష్టపడుతోంది. ఇప్పుడు వీళ్లు తప్పుకోవడంతో ఇక్కడ పెద్ద దిక్కు అవసరం ఉంది. జిల్లా మొత్తం మీద ఒక్క పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రాయానాయుడు మాత్రమే చాలా యాక్టివ్గా ఉంటూ అటు నియోజకవర్గంలోనూ, ఇటు స్టేట్లోనూ తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. దాదాపు సగం నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా మోసేవాళ్లు… పార్టీకి దారిచూపే బలమైన నాయకులు అయితే లేరు. మరి చంద్రబాబు ఇలాంటి చోట్ల పార్టీకి ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తారో ? చూడాలి.