పరిటాల రెడీ అయిపోతున్నారట… దేనికో తెలుసా?
రాజకీయాలకు పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి సెంటి మెంటును ప్రోదిచేసుకునేందుకు నాయకులు ఎక్కువగా అవలంభిస్తున్న కార్యక్రమాల్లో పాదయాత్రకు మించిన కార్యక్రమం మరొకటి [more]
రాజకీయాలకు పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి సెంటి మెంటును ప్రోదిచేసుకునేందుకు నాయకులు ఎక్కువగా అవలంభిస్తున్న కార్యక్రమాల్లో పాదయాత్రకు మించిన కార్యక్రమం మరొకటి [more]
రాజకీయాలకు పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి సెంటి మెంటును ప్రోదిచేసుకునేందుకు నాయకులు ఎక్కువగా అవలంభిస్తున్న కార్యక్రమాల్లో పాదయాత్రకు మించిన కార్యక్రమం మరొకటి లేదనేది వాస్తవం. ఈ క్రమంలోనే ఆదిలో వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రారంభమైన పాదయాత్ర పాలిటిక్స్‌ను.. తర్వాత.. చంద్రబాబు కూడా అందుకున్నారు. ఇక, ఆ తర్వాత వైఎస్ కుమార్తె.. షర్మిల, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా పాదయాత్రలను చేసిన వారే. తెలుగు గడ్డపై పాదయాత్రల రాజకీయాలకు ఉన్న సెంటిమెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ?
పాదయాత్రల ద్వారానే?
ఈ క్రమంలో పాదయాత్రల ద్వారా ఆయా నేతలు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వైఎస్, జగన్, చంద్రబాబు పాదయాత్రల ద్వారా.. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. దీంతో ఇప్పటి తరం నేతలు కూడా ఇదే మార్గం పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకుచెందిన పరిటాల ఫ్యామిలీ.. కొన్నాళ్లుగా ఇదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలు చేస్తున్న పరిటాల కుటుంబానికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. గత ఎన్నికల్లో మాత్రం పరిటాల వారసుడిగా రంగంలోకి వచ్చిన శ్రీరామ్.. రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తొలుత ధర్మవరంలో…?
అయితే.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నుంచి కూడా సానుకూల సిగ్నల్ అందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వైపు ప్రజలను తిప్పుకొనేందుకు శ్రీరాం పాదయాత్ర ను ఎంచుకుంటున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాలో తమ ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గాల్లో శ్రీరామ్ పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారట. తాను పోటీ చేయాలని అనుకుంటోన్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
రాప్తాడు, పెనుగొండల్లోనూ…?
ఆ తర్వాత రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లోనూ ఇది కొనసాగుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిటాల ఛరిష్మా తగ్గిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజలను మళ్లీ పరిటాల ఫ్యామిలీ వైపు తిప్పుకోవడంతోపాటు.. తన రాజకీయాల ను బలోపేతం చేసుకునేదిశగా శ్రీరాం.. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు పాదయాత్రను ఎంచుకున్నరాు. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు పరిటాల వర్గం నేతలు.