షెల్టర్ జోన్ లో స్లీపర్ సెల్స్ …?
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ లోని తెలుగుదేశం పార్టీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజెపి అవతరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల పడగనీడ తమపై పడకుండా ఉండేందుకు [more]
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ లోని తెలుగుదేశం పార్టీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజెపి అవతరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల పడగనీడ తమపై పడకుండా ఉండేందుకు [more]
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ లోని తెలుగుదేశం పార్టీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజెపి అవతరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల పడగనీడ తమపై పడకుండా ఉండేందుకు కేంద్రంలో అధికారంలోని పార్టీ గొడుగు కిందకు చేరితే సరిపోతుందని లెక్కసుకున్న పసుపు చొక్కాలు జై మోడీ అంటున్నాయి. తద్వారా జండా పీకేసిన బ్యాచ్ కి రెండు రకాల లబ్ధి కలుగుతుంది. అందులో ఒకటి కేంద్రం నుంచి ఎలాంటి దాడులు ఎదురుకావు. రెండోది రాష్ట్రం లో కూడా తమ జోలికి స్థానిక ప్రభుత్వాలు వచ్చే సాహసం చేయలేవు.
కోడెల ఎపిసోడ్ చూశాక …
ఏపీ లో తెలుగుదేశం సర్కార్ కొలువు తీరాక అనేక అక్రమాలు, అవినీతి అంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఆ తరువాత సర్కార్ మారింది. తమపనేదో తాము చేసుకోకుండా పాతగొడవలన్నీ తవ్వి తమ భరతం పడుతుందని తెలియనివారంతా తరువాత సర్కార్ తీరు చూసి బెంబేలు ఎత్తుతున్నారు. వచ్చి రావడంతోనే మాజీ స్పీకర్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాజీ స్పీకర్ కొడుకు కుమార్తె సహా అంతా ఫ్యామిలీ ప్యాక్ తరహాలో బుక్ అయిపోయారు. ఈ కేసుల్లో అత్యంత పరువు తీసింది మాత్రం ఫర్నిచర్ దొంగతనం. దీనిని ఏ రకంగా సమర్ధించుకోలేని పరిస్థితి లోకి తెలుగుదేశం పార్టీ పడిపోయింది. గుండెపోటు తో కోడెల ఆసుపాత్రిపాలు కావాలిసివచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా ఈ వ్యవహారం ప్రజలకు కళ్ళకు కట్టేలా వైసిపి సర్కార్ చూపించేసింది.
సుజనా, సిఎం రమేష్ బ్యాచ్ అందుకే …
బ్యాంక్ లకు ఎగనామాల కేసులో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వున్నాయి. ఇక రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై బిజెపి చేసినన్ని ఆరోపణలు గతంలో వైసిపి కూడా చేయలేదేమో. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కు రమేష్ కు మీడియా చర్చల్లో నిత్యం కొట్లాట సాగేది. రమేష్ బండారాలు బయట పెడతామని జివిఎల్ అనేక సవాళ్ళు విసిరారు. ఇక కేంద్రం లో మోడీ, రాష్ట్రం లో వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి రావడంతో సీన్ అర్ధమైన చంద్రబాబు కుడి ఎడమలు దుకాణం సర్దేసి కాషాయం కప్పేసుకుని సేఫ్ ప్లస్ లోకి వెళ్లారు.
మనువు అక్కడ మనసు ఇక్కడే …
ప్రస్తుతం తెలుగుదేశం నుంచి బిజెపి లోకి చేరిన చంద్రబాబు కు అత్యంత నమ్మకస్థులు కాషాయం పార్టీ కోసం కన్నా సైకిల్ పార్టీకే ప్రయోజనం చేకూర్చేలా కథ నడుపుతున్నారు. దాంతో బిజెపి అనుకున్నది ఒకటి అయితే జరుగుతున్నది మరొకటి అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది. దాంతో పార్టీలోని పాత కాపులకు ప్రాధాన్యత కల్పించే దిశాగా అడుగులు వేస్తుంది. సమయం వచ్చినప్పుడు పార్టీలో చేరిన కొత్త నీరు అంతా పాత చోటికే పోతుందన్న సత్యం అర్ధమై అందుకు తగిన విరుగుడు వ్యూహాలకు కమలనాధులు కసరత్తు మొదలు పెట్టారు. సోము వీర్రాజు, జివిఎల్ వంటి వారిని తిరిగి తెరపైకి వచ్చేలా వ్యూహం మొదలు పెట్టారు. తెలుగుదేశం స్లీపర్ సెల్స్ తో ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రహించే ఈ దిద్దుబాటు చర్యలని కమలం పార్టీలో చర్చ మొదలు కావడంతో భవిష్యత్తు రాజకీయాలు మరింత ఆసక్తిగా మారిపోయాయి.