Janasena : టీడీపీలో జనసేన ఫీవర్.. ఎందుకలా?
తెలుగుదేశం పార్టీ నేతలకు పరిస్థిితి అర్థమయిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని చంద్రబాబు పై వత్తిడి తెస్తున్నారు. జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని నేతలందరూ [more]
తెలుగుదేశం పార్టీ నేతలకు పరిస్థిితి అర్థమయిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని చంద్రబాబు పై వత్తిడి తెస్తున్నారు. జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని నేతలందరూ [more]
తెలుగుదేశం పార్టీ నేతలకు పరిస్థిితి అర్థమయిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని చంద్రబాబు పై వత్తిడి తెస్తున్నారు. జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని నేతలందరూ అభిప్రాయపడుతున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. ఎంపీపీ ఎన్నికల్లోనూ జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని కామెంట్ చేయడం పార్టీ నేతల మనోగతాన్ని తెలియజేస్తుంది.
ఒంటరిగా పోటీ చేసి…
చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించలేదు. ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో చంద్రబాబు తెగించి ఒంటరిగా పోటీ చేశారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటివి తిరిగి తనను ముఖ్యమంత్రిని చేస్తాయని చంద్రబాబు భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేసి జగన్ ను నిలువరించలేమని తెలిసినా, తను తప్ప ఏపీ ప్రజలకు వేరే ఆప్సన్ లేదన్న అతి విశ్వాసంతో ఒంటరిగా బరిలోకి దిగారు.
జనసేన మాటే….
కానీ ఫలితాలను చూసిన తర్వాత తన బలమేంటో చంద్రబాబుకు అర్థంకాలేదు. ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఎవరితోనైనా పొత్తుతోనే వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. జనసేన, బీజేపీ కలిసి వస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే కాంగ్రెస్ తో కలసి వామపక్షాలతోనయినా ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ టీడీపీలో మాత్రం జనసేన శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది.
పొత్తు పెట్టుకోవాల్సిందే…?
జనసేనతో తప్ప ఎవరితో కలసి పోట ీచేసినా మరోసారి ఓటమి తప్పదని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. జనసేనకు గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సీనియర్ నేతలు సయితం చంద్రబాబుకు సూచిస్తుండటం విశేషం. అయితే ఇందుకు తగిన సమయం కాదని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని చంద్రబాబు అన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన శబ్దం టీడీపీలో ఎక్కువగా విన్పిస్తుంది. సీమ, కోస్తాంధ్ర నేతల నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా విన్పిస్తుంది.