జేసీ ఈ లిస్ట్ చదువుకో…అన్యాయం ఎవరికి?
జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేశాడన్నారు. కమ్మ సామాజకవర్గాన్ని చంద్రబాబు దగ్గర [more]
జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేశాడన్నారు. కమ్మ సామాజకవర్గాన్ని చంద్రబాబు దగ్గర [more]
జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేశాడన్నారు. కమ్మ సామాజకవర్గాన్ని చంద్రబాబు దగ్గర తీయలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్న వ్యాఖ్యలకు ఈరోజు పరోక్షంగా అసెంబ్లీలో వైసీపీ కౌంటర్ ఇచ్చినట్లయింది. రాజధాని భూముల కొనుగోలులో ఎక్కువ మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు, తెలుగుదేశం పార్టీ నేతలే ముందున్నట్లు వెల్లడించారు.
నాలుగు వేల ఎకరాలు….
రాజధాని అమరావతిని ప్రకటించకముందే పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారు. 4070 ఎకరాల భూమిని తన అనుచరులకు కట్టబెట్టిన విషయం తొలి విచారణలో వెల్లడయిందన్నారు. ఇంకా భూములు కొనుగోలు చేసిన వారు ఎందరో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ రాజధానిని నిర్మిస్తామని చెప్పి ప్రజలను, విపక్షాలను మభ్యపెట్టిన చంద్రబాబు తన కోటరీ సభ్యులకు కోట్లాది విలువైన భూములను కట్టబెట్టిన విషయాన్ని సభలో వెల్లడించారు.
పెద్దయెత్తున భూపందేరం….
చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ 14. 22 ఎకరాలు కొనుగోలు చేసందన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉండి పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38 ఎకరాలు, పరిటాల సునీత తన అల్లుడి పేరు మీద ఇరవై ఎకరాలు, కొమ్మాలపాటి శ్రీధర్ 68 ఎకరాలను కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 37 ఎకరాలు కొనుగోలు చేశారు. పయ్యావుల కేశవ్ పదిహేను ఎకరాలను రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు.
కీలకనేతలే కొనుగోళ్లు…..
లోకేష్ కు అత్యంత సన్నిహితుడు వేమూరి రవికుమార్ 25 ఎకరాలు, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ 351 ఎకరాలు అత్యధికంగా కొనుగోలు చేశారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర పదిహేను ఎకరాలు, కోడెల శివప్రసాదరావు పదిహేడు ఎకరాలు, ధూళిపాళ్ల సుజన, యాగంటి శ్రీకాంత్ వంటి వారు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు పై జేసీ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. చంద్రబాబు తన సామాజికవర్గం నేతలకు పదవులు ఇవ్వకపోయినా భూములు పంచిపెట్టారని ఛలోక్తులు విసురుతున్నారు.