జంపింగ్ కు రెడీ..జగన్ ఓకే అంటేనే?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జంపింగ్‌ల కలకలం ప్రారంభమైంది. ఏ నాయకుడు ఎప్పుడు గోడదూకుతాడో తెలియని ఓ సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జంపింగ్‌ల కలకలం ప్రారంభమైంది. ఏ నాయకుడు ఎప్పుడు గోడదూకుతాడో తెలియని ఓ సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జంపింగ్‌ల కలకలం ప్రారంభమైంది. ఏ నాయకుడు ఎప్పుడు గోడదూకుతాడో తెలియని ఓ సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు తాజా ఎన్నికల అనంతరం గోడ దూకిన విషయం తెలిసిందే. అయితే, వీరి సంఖ్య ఇక్కడితో ఆగుతుందా? లేక కొనసాగుతుందా? అనేది మాత్రం సందేహంగానే ఉంది. పార్టీ అధినేత చంద్రబాబుపై నమ్మకం కోల్పోయిన కొందరు సీనియర్లు.. ఇప్పటికే పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ పరిస్థితి దీనికి అద్దం పడుతోంది.
మాజీ మంత్రిదీ…..
ఇక, ఇదే జిల్లాకు చెందిన మాజీ విప్ యామినీ బాల కూడా వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈమె మాతృమూర్తి శమంతకమణి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.అయితే, ఇక్కడితో ఆమె రిటైర్ అవుతారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇక, చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే, మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో వైసీపీటి కెట్‌పై గెలిచిన ఆయన తర్వాత సైకిలెక్కి.. మంత్రి పదవి సంపాయించుకున్నారు. ఇప్పుడు ఓటమి పాలవడంతో జగన్ చెంతకు చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఓటమి పాలయిన ఇద్దరూ….
అదేవిధంగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా జగన్ చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. 2014లో ఈమె కూడా వైసీపీ టికెట్‌పై విజయం సాధించి, తర్వాత చంద్రబాబు చెంతకు చేరారు. ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి తాను వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఇక, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవ ర్గంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తిరిగి జగన్ చెంతకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అఖిలకు అర్థంకాక…..
ఇటీవల ఎన్నికల్లో ఆయన తన కుమార్తె ఖతూన్‌ను పోటీ చేయించినా.. ఆమె పరాజయం పాలయ్యారు. ఇక, ఇప్పుడు తాను మరోసారి జగన్ చెంతకు చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నా రు. అయితే, అనారోగ్య కారణాలు ఆయనను పట్టి పీడిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కర్నూలుకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తిరిగి 'జగనన్న' చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. 2014లో వైసీపీ తరఫున పోఈ చేసి విజయం సాధించిన అఖిల ప్రియ తన తండ్రి నాగిరెడ్డి వెంటనడిచి టీడీపీలో చేరడం, తర్వాత మంత్రి కావడం తెలిసిందే. అయితే, తనను తాను ఫైర్ బ్రాండ్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈమెకు టీడీపీలో సహకారం ఉండడం లేదనే ఆగ్రహంతో ఆమె ఊగిపోతున్నారు.
కడప నేతలు కూడా…..
ఇటీవల యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆమె ఉద్యమం తరహాలో ఆందోళన చేసినప్పుడు టీడీపీ నుంచి ఒక్కరు కూడా ఆమెకు మద్దతు పలకలేదు. పైగా ఆమె భర్తకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక, కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి(ఈయన బీజేపీలోకి వెళ్లాలని చూసినా.. లైన్ క్లియర్ కాలేదు. కేసుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు) కూడా వైసీపీ బాట పట్టాలని చూస్తున్నారు. ఇక అదే నియోజకవర్గానికి చెందిన మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా.. ఎక్కడికక్కడ టీడీపీ నుంచి నేతల జంపింగులు ఉండేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదే కనుక జరిగితే.. టీడీపీ మరింత బలహీనపడడం ఖాయమని అంచనా వేస్తున్నారు.