హూ ఈజ్ నెక్ట్స్
రాజకీయ వారసత్వం అందరికీ కలిసి వస్తుందా? కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను వేధించే ప్రధాన ప్రశ్న ఇది. మేం నిలదొక్కుకున్నాం.. మా తర్వాత [more]
రాజకీయ వారసత్వం అందరికీ కలిసి వస్తుందా? కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను వేధించే ప్రధాన ప్రశ్న ఇది. మేం నిలదొక్కుకున్నాం.. మా తర్వాత [more]
రాజకీయ వారసత్వం అందరికీ కలిసి వస్తుందా? కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను వేధించే ప్రధాన ప్రశ్న ఇది. మేం నిలదొక్కుకున్నాం.. మా తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు జవాబుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలువురు కీలక నేతలు వారివారి రాజకీయ వారసులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా అనంతపురంలో అయితే, ఏకంగా ముగ్గురు వారసులు రంగంలోకి దిగి.. తమ అదృష్టాన్ని పరీశీలించుకున్నారు. అయితే వీరంతా కూడా జగన్ సునామీ ముందు తేలిపోయారు. గెలుస్తామని వెయ్యిఆశలు పెట్టుకున్న నాయకులు కూడా వైసీపీ సంచలన విజయం ముందు తెలుగుదేశం పార్టీ నేతలు నిలబడలేకపోయారు.
కుమార్తెలను రంగంలోకి దింపి….
ఇదిలావుంటే, మరో పక్క పుత్రులు ఉన్నా లేకున్నా.. తమ వారసులుగా కుమార్తెలను రంగంలోకి తీసుకువచ్చిన నాయకులు కూడా ఉన్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీ వారే కావడం గమనార్హం. ముఖ్యంగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ సీనియర్లు తమ కుమార్తెలను ఎన్నికల బరిలోకి దింపారు. వీరిని గెలుచుకోవాలని ఉబలాట పడ్డారు. ఒక్క కురుపాం రాజా.. కిషోర్ చంద్రదేవ్ విషయం మినహా.. మిగిలిన ఇద్దరూ కూడా తమ కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. అయినా కూడా ఎన్నికల్లో వారిని ప్రజలు దీవించకపోవడంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనే విషయం చర్చకు దారితీస్తోంది.
జలీల్ ఖాన్:
మైనార్టీ వర్గానికి చెందిన కీలక నాయకుడు ఈయన. ఇప్పటికి మూడు పార్టీలు మారినా నాయకుడిగా విజయవాడ వాసులకు, బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ.. ఎంటైర్ రాష్ట్రానికి ఇప్పటికీ గుర్తుండిపోయిన నేత. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో ఉన్న ఈయన తర్వాత ఆయన మరణంతో జగన్‌కు జై కొట్టారు. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ టికెట్‌పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, ఎంతైనా రాజకీయ నేత, వయసు మళ్లుతోంది. సో.. ఏదో కీలక పదవిపై వ్యామోహం చెందారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పిలుపుతో ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించి వైసీపీకి రాంరాం పలికారు.తెలుగుదేశం పార్టీ లో చేరారు. అయితే, బీకాంలో ఫిజిక్స్ అంటూ చేసిన వ్యాఖ్యలతో బాబు.. ఆయనను పక్కన పెట్టారు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో వయసు సమస్యలు, అనారోగ్యం కారణంగా తాను తప్పుకొంటున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తన కుమార్తె ఖతూన్‌ను రంగంలోకి దింపారు. శతవిధాలా గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే ప్రజలు మాత్రం తిరస్కరించారు. దీంతో ఇప్పుడు తండ్రీ కూతుళ్లు రాజకీయాలకు స్వస్తి పలికినట్టే అంటున్నారు.
అశోక్‌గజపతి:
తెలుగుదేశం పార్టీ కే చెందిన మరో కీలక నాయకుడు. మాజీ మంత్రి, విజయనగరం రాజులు అశోక్ గజపతిరాజు. ఈయన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన వారసురాలిగా ఉన్నత విద్యావంతురాలు అదితిని రంగంలోకి దింపారు. తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆయన విజయనగరం ఎంపీగా, కుమార్తె ఎమ్మెల్యేగా పోటీ చేశారు తన అనుభవసారాన్ని మొత్తం పిండి మరీ ప్రచారం చేశారు. అయినా కూడా ప్రజలు జగన్ కి, ఆయన పార్టీ అభ్యర్థులకు జై కొట్టారు. దీంతో ఈ ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటికే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి అశోక్ తప్పుకోవడం ఖాయం. మరి అయినా కుమార్తె పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె ఓడినా కూడా కొద్దిగా ప్రజల్లోనే ఉంటున్నారు. సో.. కాబట్టి కొంత మేరకు అసలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కిషోర్‌చంద్రదేవ్:
కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్ర పడ్డ అరకు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కేంద్రంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఆయన విభజన తర్వాత కాంగ్రెస్ ను విభేదించినా.. వైసీపీ వైపు మాత్రం చూడకుండా ఎన్నికలకు కొద్ది నెలల ముందు తెలుగుదేశం పార్టీ బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అరకు ఎంపీ టికెట్ సంపాయించుకున్నారు. ఈయన కూడా రాజకీయ కురువృద్ధ జాబితాలో నాయకుడే. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె శృతి దేవ్ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. చిత్రంగా ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని అదే అరకు ఎంపీ స్థానం నుంచి తండ్రిపై పోటీ చేశారు. అయితే ప్రజలు ఈ ఇద్దరిని తిరస్కరించారు. దీంతో ఇప్పుడు వీరి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఆయా పార్టీల్లోనే ఉంటారా ? లేక రాజకీయాల నుంచి విరమించుకుంటారా? చూడాలి. కిషోర్ వయస్సు పైబడడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే… మరి ఆయన కుమార్తె భవితవ్యం ఎలా ఉంటుందో ? చూడాలి.