ఆ పేరు చెపితేనే టీడీపీ నేతలకు జ్వరమొస్తోందా ?
ఏపీలో వరసపెట్టి ఉప ఎన్నికలు వచ్చేలా సీన్ కనిపిస్తోంది. ఇటీవలే తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ టీంను అంతా అక్కడ మోహరించినా వైసీపీకి [more]
ఏపీలో వరసపెట్టి ఉప ఎన్నికలు వచ్చేలా సీన్ కనిపిస్తోంది. ఇటీవలే తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ టీంను అంతా అక్కడ మోహరించినా వైసీపీకి [more]
ఏపీలో వరసపెట్టి ఉప ఎన్నికలు వచ్చేలా సీన్ కనిపిస్తోంది. ఇటీవలే తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ టీంను అంతా అక్కడ మోహరించినా వైసీపీకి ఏకంగా 2.75 లక్షల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక వచ్చే నెలలో కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. కడప జిల్లా అంటేనే జగన్ కి కంచుకోట. ఇక బద్వేల్ లో చూసుకుంటే గత కొన్ని ఎన్నికల నుంచి టీడీపీ గెలుపు మాట అన్నది అసలు మరచిపోయింది. దాంతో ఇపుడు బద్వేల్ ఉప ఎన్నిక అంటే టీడీపీకి జడుపు జ్వరమే వస్తోందిట. బద్వేల్ ఉప ఎన్నికల బరిలో దివంగత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ ఇవ్వనున్నారు. పైగా వైసీపీ కూడా బలంగా ఉంది. ఇటు అధికారు, అటు సానుభూతి, మరో వైపు జగన్ వేవ్ ఇవన్నీ కలసి చూస్తే ఇక్కడ కూడా వైసీపీకి బంపర్ మెజారిటీ రావడం ఖాయం.
బలం చూసుకోవాలని….
దాంతో టీడీపీ ఈ వైపునకు చూడడమే టైం వేస్ట్ అనుకుంటోందిట. అయితే ఉప ఎన్నికలు జరిగిన చోట ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోటీలో లేకపోతే కొంప మునుగుతుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే రాయలసీమలో చాలా చోట్ల ఇలాగే టీడీపీ బలాన్ని సున్నా చేసుకున్నామని వారు అంటున్నారు. దాంతో బద్వేల్ లో పోటీ చేసి తీరాల్సిందే అన్న మాట కూడా పార్టీలో వినిపిస్తోంది. మనం బలం ఎంతో చూసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీలో సీమ నేతలు చెపుతున్నారట. అయితే చంద్రబాబుకు ఇది ఇరాకాటమే అంటున్నారు.
బద్వేల్ తో పాటు…
పోటీ చేస్తే గెలుస్తామన్నది పక్కన పెడితే వైసీపీ మెజారిటీని కూడా తగ్గించలేకపోతే పరువు పూర్తిగా మంటకలుస్తుంది అన్న కలవరం టీడీపీ పెద్దలలో ఉందిట. ఇంకో వైపు చూసుకుంటే కళ్ల ముందే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల చేదు ఫలితం కూడా ఉంది. దాంతో ఓడితే ఏపీలో టీడీపీ పని సరి అని అధికార పార్టీ గట్టిగా ప్రచారం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే బద్వేల్ తో పాటు ఏపీలో నర్సాపురం లోక్ సభకు కూడా ఉప ఎన్నిక జరిగుతుందా ? అన్న చర్చ కూడా ఉంది.
ఇక్కడ మెజారిటీని బట్టి….
బద్వేల్ లో బంపర్ మెజార్టీ వస్తే వైపు ఏపీలో వైసీపీకి జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలకు కూడా జగన్ పచ్చ జెండా ఊపుతారు అంటున్నారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలతో కనీసం ఒకరిద్దరు చేత అయినా ఆయన రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఇందుకు తిరుపతి, మున్సిపోల్స్‌లో వైసీపీ అప్రతిహత విజయం జగన్ లో మరింత ధీమా పెంచిందట. రేపు బద్వేల్ లో కూడా అదే పరిస్థితి రిపీట్ అంటున్నారు. ఇలా ఉప ఎన్నికల్లో కనుక వరసపెట్టి టీడీపీ ఓడితే ఆ పార్టీ గ్రాఫ్ ఇంకా దారుణంగా దిగజారడం ఖాయమే. కానీ ఉప ఎన్నిక అనివార్యం. పోటీ చేయాల్సి రావడమూ అనివార్యమే. అందుకే టీడీపీ శిబిరం టెన్షన్ లో ఉంది.