ముగ్గురూ వీర విధేయులే.. అయినా?
కృష్ణా జిల్లాలో టీడీపీకి బలం నానాటికీ సన్నగిల్లుతోంది. పరిస్థితి ఏ రోజు కారోజు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలో బలమైన గళం వినిపిస్తున్న ముగ్గురు నాయకులు త్వరలోనే [more]
కృష్ణా జిల్లాలో టీడీపీకి బలం నానాటికీ సన్నగిల్లుతోంది. పరిస్థితి ఏ రోజు కారోజు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలో బలమైన గళం వినిపిస్తున్న ముగ్గురు నాయకులు త్వరలోనే [more]
కృష్ణా జిల్లాలో టీడీపీకి బలం నానాటికీ సన్నగిల్లుతోంది. పరిస్థితి ఏ రోజు కారోజు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలో బలమైన గళం వినిపిస్తున్న ముగ్గురు నాయకులు త్వరలోనే డమ్మీలు కానున్నారు. వీరికి ప్రజల్లో పెద్దగా బలం లేకపోయినా.. పార్టీ తరఫున వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికార పక్షానికి ముకుతాడు వేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. అయితే, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ ఇరకాటంలో పడింది. కృష్ణాజిల్లాలో పార్టీకి అండగా ఉన్న త్రిమూర్తులు.. బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్ర ప్రసా ద్, బచ్చుల అర్జునడులు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
బలమైన వాయిస్ తో…..
వీరిలో బచ్చుల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే బుద్ధా వెంకన్న విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్నారు. ఇక, వైవీబీ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. పార్టీ తరఫున ఈ ముగ్గురూ కూడా కీలకంగా మారారు. ఇతర పార్టీలు ఎన్ని రకాలుగా పిలిచినా వీరు ఎట్టి పరిస్థితిలోనూ జంప్ చేయరు. పైగా చంద్రబాబుకు అత్యంత విధేయులుగా పేరు కూడా తెచ్చు కున్నారు. అలాంటి వారివల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్టీకి మేలు చేకూరుతోందనడంలో సందేహం లేదు. అందుకే చంద్రబాబు వీరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు.
మండలి రద్దుతో…..
వీరు ముగ్గురూ పార్టీకి బలమైన వాయిస్ ఇస్తూనే ఉన్నారు. వైవీబి, బుద్ధా వెంకన్న ఎక్కువుగా మీడియాలో కనపడుతూ పార్టీ వాయిస్‌కు వెన్నుముకగా ఉంటే ఇటు బచ్చుల అర్జునుడు జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఉత్తేజం చేయడంలో ముందుంటారు. అయితే, ఇప్పుడు జగన్ మండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా దీనిని కేంద్రానికి పంపారు. అంతేనా. అత్యంత వేగంగా మండలిని రద్దు చేసేలా ఆయన కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చారు.
పదవులు లేకుంటే?
మోడీ, అమిత్ షాలను కలిసి విన్నవించిన వాటిలో మండలి రద్దు కీలక అంశంగా మారింది. దీంతో వారు మండలి రద్దుకు ఓకే అంటే వచ్చే రెండు మూడు మాసాల్లోనే మండలి రద్దయ్యే ఛాన్స్ ఉంది. దీంతో కృష్ణాలో టీడీపీకి త్రిమూర్తులుగా ఉన్న నాయకులు మండలి రద్దుతో తమ పదవులు కోల్పోతారు. ఇదే జరిగితే.. వీరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి? ఏ విధంగా వీరి వాయిస్‌ను వినియోగించాలనేది బాబుకు పెద్ద సమస్యగా మారనుంది. మరి ఏం చేస్తారో చూడాలి.