జగన్ ఊ అంటే రెడీ.. సిగ్నల్ కోసమే ఎదురు చూపులు
నిన్నటి వరకు ఒక మాట.. రేపు ఇంకో మాట. ఇది రాజకీయాల్లో మామూలే. అసలు ఇలా లేకుండా ఒక్కచోటే కూర్చున్నా.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం [more]
నిన్నటి వరకు ఒక మాట.. రేపు ఇంకో మాట. ఇది రాజకీయాల్లో మామూలే. అసలు ఇలా లేకుండా ఒక్కచోటే కూర్చున్నా.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం [more]
నిన్నటి వరకు ఒక మాట.. రేపు ఇంకో మాట. ఇది రాజకీయాల్లో మామూలే. అసలు ఇలా లేకుండా ఒక్కచోటే కూర్చున్నా.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇలా జంప్ చేసే నాయకుల కు అందరికీ కలిసి వస్తుందా? అంటే చెప్పడం కష్టం. అందుకే అలా కలిసి రాని నేతలు మళ్లీ ఘర్ వాపసీ అంటున్నారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన మహిళా నాయకులు తర్వాత కాలంలో టీడీపీకి జైకొట్టారు. మంత్రి పదవులు కావొచ్చు. లేదా ఆర్థిక సాయం కావొచ్చు. ఏదైనా సరే.. చంద్రబాబు వలలో చిక్కుకున్నారు. తమకు టికెట్ ఇచ్చి.. తాము గెలిచేందుకు కారణమైన జగన్‌కు ఝలక్ ఇచ్చారు.
2014లో విజయం సాధించి….
ఈ క్రమంలోనే 2017లో సైకిల్ ఎక్కారు. అయితే, కొందరికి పదవులు దక్కినప్పటికీ.. మహిళలకు మాత్రం పదవులు దక్కలేదు. పోనీ నామినేటెడ్ పదవులైనా దక్కుతాయా? అంటే అది కూడా లేదు. దీంతో వారంతా ఉసూరుమన్నారు. వీరిలో పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన , పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిలు కీలకంగా ఉన్నారు. వీరంతా జగన్‌కు అత్యంత సన్ని హితులు కానీ, చంద్రబాబు విసిరిన ఆపరేషన్ ఆకర్ష్‌కు లొంగిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా వీరు ముగ్గురు మాత్రం వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ప్రయత్నాలు చేస్తున్నా….
ఇక గత ఏడాది ఎన్నికల్లో వీరంతా టీడీపీ జెండాపైనే పోటీ చేసినా.. జగన్ సునామీని తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలోనే ఓడిపోయారు. వీరంతా వైసీపీలోనే ఉండి ఉంటే వీళ్లు ఇప్పుడు కీలకంగా చక్రం తిప్పేవారు. ఎన్నికలన్నాక గెలుపు , ఓటములు సహజమే అయినా.. ఈ నాయకురాళ్లు మాత్రం రాజకీయంగా గుర్తింపు కోల్పోయారు. గిడ్డి ఈశ్వరిని నియోజకవర్గంలో ప్రజలు కూడా నిలదీసిన సందర్భాలు కనిపించాయి. మేం నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే.. టీడీపీలో ఎందుకు చేరిపోయావంటూ.. ఆమెను నిలదీశారు. ఇక ఇప్పుడు ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
టీడీపీ క్యాడర్ పక్కన పెడుతుండటంతో….
ఇక, రాజేశ్వరి పరిస్థితి దారుణం.. రంపచోడవరం టీడీపీ శ్రేణులతో ఆమె అనుసంధానం చేసుకోలేక పోతున్నారు. వారే ఆమెను పక్కన పెడుతున్నారు. ఇదే పరిస్థితి పామర్రులోనూ ఉప్పులేటి కల్పనకు ఎదురవుతోంది. ఆమె పిలుస్తున్నా.. పార్టీ నాయకులు ఎవరూ వచ్చి ఆమె చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసలు ఆమెను పక్కన పెట్టేయాలని టీడీపీ కేడరే కోరుతోంది. దీంతో ఇప్పుడు వీరు ముగ్గురూ సైకిల్ దిగిపోవాలని అనుకున్నారు. నిజానికి ఈ ముగ్గురూ కూడా ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్ ఊ! అంటేచాలని వీరు కండువాలు మార్చేందుకు రెడీగా ఉన్నారని వీరి అనుచరులు చెబుతుండడం గమనార్హం.