నాలుగు ఎన్నికల నుంచి గెలుపులేక….?
కడర జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. అందులో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కడప జల్లాలో మాత్రం జగన్ పార్టీదే పై చేయిగా [more]
కడర జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. అందులో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కడప జల్లాలో మాత్రం జగన్ పార్టీదే పై చేయిగా [more]
కడర జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. అందులో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కడప జల్లాలో మాత్రం జగన్ పార్టీదే పై చేయిగా ఉంటుంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొన్నేళ్లుగా టీడీపీ విజయానికి నోచుకోవడం లేదు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబం బరిలో ఉంటుంది కాబట్టి అక్కడ అవకాశముండదు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లోనూ కొన్ని దఫాలుగా టీడీపీికి గెలుపు బాట పట్టలేదు. అలాంటి నియోజకవర్గంలో రాయచోటి ఒకటి.
వరస ఓటములే…..
రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ 2004లో గెలిచింది. అప్పట్లో పాలకొండ్రాయుడు గెలిచారు. అప్పట్లో వైఎస్ హవాలోనూ పాలకొండ్రాయుడు గెలిచారు. ఇక 2004 నుంచి రాయచోటిలో గెలుపు అనేది టీడీపీకి తెలియదు. ఇక్కడ ప్రతి ఎన్నికలో అభ్యర్థిని మార్చినా ఫలితం లేదు. 2004 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరుపున, 2012లో జరిగిన ఉప ఎన్నిక, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిదే విజయం అయింది.
పార్టీలో నేతల మధ్య…..
అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పాలకొండ్రాయుడుకు, రెండుసార్లు టిక్కెట్ పొందిన రమేష్ రెడ్డికి మధ్య సఖ్యత కుదర లేదు. గత ఎన్నికల్లోనూ ఆయనకే టిక్కెట్ ఇవ్వడంతో పాలకొండ్రాయుడు వర్గం సహకరించలేదన్న సంగతి రమేష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే గత ఇరవై నెలలుగా రమేష్ రెడ్డి జాడ రాయచోటిలో లేదంటున్నారు. చుట్టపు చూపుగా వచ్చిపోవడం తప్ప క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఉన్న క్యాడర్ సయితం….
పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా స్పందించలేదంటున్నారు. ఇప్పటికే ఒకటిన్నర దశాబ్దం నుంచి రాయచోటి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురలేదు. అయినా అక్కడ పార్టీని చక్కదిద్దే కార్యక్రామాన్ని టీడీపీ హైకమాండ్ సయితం చేపట్టకపోవడం గమనార్హం. కడప జిల్లా కావడం, అక్కడ శ్రీకాంత్ రెడ్డి పాతుకుపోవడంతో నియోజకవర్గంలో కొద్దో గొప్పో ఉన్న క్యాడర్ కూడా పార్టీని వదిలి వెళ్లే అవకాశముంది. ఇప్పటికైనా అధినాయకత్వం జోక్యం చేసుకోకుంటే పార్టీ వచ్చే ఎన్నికలోనూ కనీస పోటీ ఇవ్వడం కష్టమేనంటున్నారు.