హైప్ లేదు.. హోప్ లేదు…ఎలా?
తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా ఏడాదిలో ఏ మాత్రం పార్టీకి హైప్ కానీ హోప్ కానీ తేలేకపోయారు. దానికి [more]
తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా ఏడాదిలో ఏ మాత్రం పార్టీకి హైప్ కానీ హోప్ కానీ తేలేకపోయారు. దానికి [more]
తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా ఏడాదిలో ఏ మాత్రం పార్టీకి హైప్ కానీ హోప్ కానీ తేలేకపోయారు. దానికి తోడు తొందరపాటు విధానాలు, తప్పుడు వ్యూహాలు, సెల్ఫ్ గోల్స్ వంటివి టీడీపీని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం, అతి తక్కువ ఓట్లు రావడం ఈ పరాభవంలో భాగమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ నిలిచి గెలుస్తుందని ఆ పార్టీ తమ్ముళ్ళు అంటున్నారు. అందుకు ఒక్కడు కావాలని కూడా చెబుతున్నారు.
ఎన్టీయార్ లా….
అప్పట్లో కాంగ్రెస్ సామ్రాజ్యం ఏపీ అంతటా అప్రతిహతంగా పరచుకున్న వేళ ఒకే ఒక్కడుగా ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టి ముందుకు వచ్చారని, కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారం హస్తగతం చేసుకుని కొత్త చరిత్రను రాశారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అంటున్నారు. అందువల్ల ఒక్కడు చాలు వైసీపీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి అని ఆయన అంటున్నారు. 151 సీట్లు రావడం గొప్ప కాదని, జనం మెప్పు సాధించాలని సూచిస్తున్నారు. ఆ గర్వంతోనే ఉంటే, వాపుఏ బలంగా అనుకుంటే మాత్రం వైసీపీ మట్టికరుస్తుందని కూడా జోస్యం చెబుతున్నారు.
ఎవరా ఒక్కరు….?
అశోక్ బాబు బాగానే చెప్పారు, తమ్ముళ్లకు ధైర్యం కలిగించే నాలుగు మాటలుగా వీటిని చూడాలి. అలాగే ఆయన విశ్లేషణ కూడా బాగుంది. ఒక్కడు బలమైన వాడు వస్తే ఎటువటి సామ్రాజ్యాలు అయినా కూలుతాయి అని చరిత్ర కూడా నిరూపించింది. మరి ఇంత చెప్పిన అశోక్ బాబు ఆ ఒక్కడూ టీడీపీలో ఉన్నారో లేదో మాత్రం చెప్పలేదు. మరి ఆ ఒక్కరు కావాలి అంటూంటే ప్రస్తుతం పార్టీలో అలా బలమైన నాయకుడు లేరా అన్న అనుమానాలు వస్తున్నాయి. అదే విధంగా ఇపుడున్న టీడీపీని లేపే నాధులు లేరా అన్న కొట్ట డౌట్లు కూడా పుట్టుకువస్తున్నాయి. మరి ఇన్ని చెప్పిన అశోక్ బాబు లోకేష్ ఆ ఒక్కడూ అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారోనని అంటున్నారు.
జూనియర్ మీదనేనా…?
తెలుగుదేశం పార్టీలో లోకేష్ చంద్రబాబులే అధినాయకులు. వారే పార్టీకి కర్త కర్మ, క్రియ, వారు ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికలు టీడీపీ ఎదుర్కొంది, ఓడింది. ఈ ఏడాదిలో కూడా పార్టీ ఎత్తిగిల్లిన దాఖలాలు లేవు. మరి వారితో టీడీపీ బలం పెరగడం అన్నది కష్టమని తేలుతోంది. అలాంటపుడు ఒక్కడు వస్తాడు అంటే ఆ ఒక్కడూ ఎవరు, జూనియర్ ఎన్టీయార్ గురించేనా అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేసింది అన్న డౌట్లు వస్తున్నాయి. నాడు ఎన్టీయార్ తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి వచ్చారు అంటూ ఉదహరించిన అశోక్ బాబు అదే సినీ గ్లామర్ తో అదే పేరుతో ఉన్న జూనియర్ గురించే ఈ కామెంట్స్ చేసి ఉంటారని కూడా అంటున్నారు. మరి లేకపోతే ఇంత దమ్ముగా ఆ ఒక్కడూ మా లోకేష్ బాబు అని ఎందుకు చెప్పలేదని కూడా అంటున్నారు. మొత్తానికి బయట వారు అంటున్నట్లుగా టీడీపీకి ఒక్కడు కావాలి. ఆ ఒక్కడూ రావాలి. దాని కోసమే ఇపుడు తమ్ముళ్లంతా ఎదురుచూడాలి.