త్వరలో టిడిపి పై మరో అస్త్రం ..?
ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పసుపు దళాన్ని కలవర పెడుతుంది. మరోపక్క టిడిపి పై మరో సినిమా అస్త్రం గా రెడీ అవుతున్నట్లు [more]
ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పసుపు దళాన్ని కలవర పెడుతుంది. మరోపక్క టిడిపి పై మరో సినిమా అస్త్రం గా రెడీ అవుతున్నట్లు [more]
ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పసుపు దళాన్ని కలవర పెడుతుంది. మరోపక్క టిడిపి పై మరో సినిమా అస్త్రం గా రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రముఖ రచయితా, నటుడు పోసాని కృష్ణ మురళి చేపట్టారని తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమా కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్లు టిడిపి శ్రేణుల్లోనే ప్రచారం సాగుతుంది. ఆర్జీవీ చిత్రం తేబోయే తలపోటుకు తాజా సినిమా తోడైతే పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ అవుతామన్న ఆందోళన టిడిపి లో వినవస్తుంది. పైగా ఈ చిత్రం రాజకీయ వ్యంగ్య చిత్రంగా సిల్వర్ స్క్రీన్ పైకి పోసాని తేనున్నట్లు చెబుతున్నారు.
ఆయన శైలే విభిన్నం …
పోసాని కృష్ణ మురళి తూటాల్లాంటి మాటలు రాయడమే కాదు, మాట్లాడినా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తారు. ఆయన గతంలో చిలకలూరిపేట నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత సినిమాలపై దృష్టి పెట్టిన పోసాని 2014 తరువాత వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒక కామన్ మ్యాన్ గా టిడిపి సర్కార్ పైనా చంద్రబాబు పై మీడియా వేదికగా చెలరేగుతూ ఆయన పాలన లోపాలను చెడుగుడు ఆడుతూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర లో సైతం పాల్గొని మద్దత్తు పలికారు.
పోసాని సినిమా సంచలనం సృష్టిస్తుందా …?
రాజా…. రాజా అంటూ ఆ పేరునే తన పేరుగా మార్చుకున్న పోసాని సినిమా ఏ అంశంపై తీయనున్నారు ? అదే ఇప్పుడు సస్పెన్స్. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే భారీ పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో పోసాని సినిమాకు ఎలాంటి ప్రచారం ఇప్పటిదాకా లేకపోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఆయన ఇంత సీక్రెట్ గా ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోసాని రాజకీయ వ్యంగ్య చిత్రం తీస్తున్నారా లేక వచ్చే ఎన్నికలకు ప్రచార కార్యక్రమాల షూటింగ్ బాధ్యతలు చేపట్టారా ? అన్నది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.
- Tags
- andhrapradesh electioons
- lakshmis ntr
- posani krishnamurali
- ramgopal varma
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à± à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°ªà±à°¸à°¾à°¨à°¿ à°à±à°·à±à°£à°®à±à°°à°³à°¿
- à°°à°¾à°à°à±à°ªà°¾à°²à± వరà±à°®
- à°²à°à±à°·à±à°®à±à°¸à± à°à°¨à±à°à±à°à°°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±