ఇద్దరు కలిసిపోతారా …?
తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అని నిగ్గుతేల్చారు టిడిపి కాపు నేతలు. కాకినాడలో ఆత్మీయ కలయిక పేరుతో ఆ తరువాత హైదరాబాద్ లో [more]
తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అని నిగ్గుతేల్చారు టిడిపి కాపు నేతలు. కాకినాడలో ఆత్మీయ కలయిక పేరుతో ఆ తరువాత హైదరాబాద్ లో [more]
తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అని నిగ్గుతేల్చారు టిడిపి కాపు నేతలు. కాకినాడలో ఆత్మీయ కలయిక పేరుతో ఆ తరువాత హైదరాబాద్ లో హల్ చల్ చేసిన కాపు నేతలు ఫైనల్ గా చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ అయి అసలు విషయం నెమ్మదిగా చెప్పేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు లేకుండా ఎన్నికల గోదాలో దిగి ఘోరంగా దెబ్బతిన్నామని అధినేత ముందు విశ్లేషించారు వారంతా. తమ తమ నియోజకవర్గాల్లో ఘోరంగా ఓటమి పాలు కావడానికి సేన చీల్చిన ఓట్లే కారణమని చెబుతూ సహేతుకంగా వివరణాత్మకంగా చంద్ర బాబుకు తెలియచెప్పారు.
ఒక్క తప్పటడుగుతో తుక్కయిపోయాం …
టిడిపి వేసిన తప్పటడుగు తో తుక్కయిపోయామని వాపోయారు మాజీలుగా మారిన కాపు ఎమ్యెల్యేలు. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రు, బోండా ఉమా తదితరులంతా బాబుతో చర్చలు సాగించి ఆయన ఇచ్చిన భరోసా తో తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. అవకాశం దొరకడం తో పార్టీలో కాపులకు ఇవ్వలిసిన ప్రాధాన్యతను పనిలో పని వివరించారు వారు. వచ్చే ఎన్నికల్లో అయినా పవన్ కల్యాణ్ తో కలిసి నడవడమే మేలని తేల్చారు.
ఉభయతారకం అంటున్నారు ..
సినీ హీరోగా ఎంత గ్లామర్ వున్నా పవన్ కల్యాణ్ తానూ పోటీ చేసిన రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. ప్రజల్లో పెద్దగా ఇమేజ్ లేని పార్టీలతో పవన్ పెట్టుకోవడం కూడా ఏమాత్రం కలిసి రాలేదు సరికదా ఆ వ్యూహం కామెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో టిడిపి పవన్ కి స్నేహహస్తం చాచితే జనసేనానని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే ఫలితం ఎలా వుండబోతుందో చూడాలి.