నాలుగు గోడల మధ్యనే టీడీపీ
టీడీపీ పుట్టింది నాలుగు గోడల మధ్య. సరిగ్గా ఇప్పటికి 38 ఏళ్ళ క్రిత్రం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మార్ఛి 29న ఒక గదిలో టీడీపీని [more]
టీడీపీ పుట్టింది నాలుగు గోడల మధ్య. సరిగ్గా ఇప్పటికి 38 ఏళ్ళ క్రిత్రం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మార్ఛి 29న ఒక గదిలో టీడీపీని [more]
టీడీపీ పుట్టింది నాలుగు గోడల మధ్య. సరిగ్గా ఇప్పటికి 38 ఏళ్ళ క్రిత్రం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మార్ఛి 29న ఒక గదిలో టీడీపీని పెడుతున్నట్లుగా నాటి ప్రఖ్యాత నటుడు, వెండితెర వేలుపు ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పట్లో ఉన్న అతి తక్కువ మీడియాలోనే అది పెను సంచలనమైంది. ఆ తరువాత ఎన్టీఆర్ చైతన్యరధంతో ఉమ్మడి ఏపీ అంతటా తిరిగి టీడీపీ ప్రభంజనం సృష్టించారు. అనుకున్నట్లుగానే 1983 ఎన్నికల్లో టీడీపీ అదిరిపోయే ఫలితాలతో అధికారం చేపట్టింది.
ఇపుడు కూడా…..
టీడీపీ గుర్తు అయిన సైకిల్ చక్రం తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకుంది. ఏ హైదరబాద్ లో ఒక గదిలో నాటి అధ్యక్షుడు టీడీపీని పెట్టారో ఇపుడు అదే భాగ్యనగరంలో తన గదిలో నుంచి ఇప్పటి అధ్యక్షుడు చంద్రబాబు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిజంగా ఇది యాధృచ్చికమే అయినా పార్టీ చరిత్ర గతిని కూడా చెబుతోంది. నాడు పార్టీ పెట్టినపుడు పుంజీడు మంది మాత్రమే అన్న గారి వెంట ఉన్నారు. ఇపుడు పార్టీ నాలుగు దశాబ్దాలకు చేరువ అవుతున్న వేళ చంద్రబాబు చుట్టూ కూడా కొద్ది మంది మాత్రమే నాయకులు కనిపిస్తున్నారు.
అన్నగారి ఆనవాళ్ళు….
టీడీపీ పెట్టినపుడు అన్న గారి వెంట ఉన్న పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇపుడు రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇక సైకిల్ గుర్తుని ఎంపిక చేసుకున్నపుడు కానీ, పార్టీ లోగోను దగ్గరుండి రూపకల్పన చేసినపుడు కానీ ఇప్పటి అధ్యక్షుడు చంద్రబాబు సహా మెజారిటీ నేతలు, దిగ్గజ నాయకులు ఎవరూ లేరు. గుడిసె గుర్తుని ఎన్టీఆర్ పెట్టి పేదలకు పార్టీని చేరువ చేయడానికి ప్రయత్నించారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పార్టీ లోగోలో గుడిసె అలాగే ఉన్నా కార్పోరేట్ శక్తులకే దాసోహమైంది. ఏది ఏమైనా టీడీపీని చూసినపుడు మాత్రం అన్న గారు పౌరుషం. ఆయన ధృఢ దీక్ష, ఒక విప్లవం, జన ప్రభంజనం గుర్తుకువస్తాయి.
ఆ జోరు సాగేనా…?
ఇపుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ మాదిరిగానే టీడీపీ కూడా అనేక అవలక్షణాలతోనానా అవస్థలు పడుతోంది. పార్టీలో చిత్తశుధ్ధి కరవు అయింది. నిబద్ధతతో పనిచేసే వారు లేకుండా పోయారు. స్వార్ధం, అవకాశం వాదం బాగా పెరిగింది. కులతత్వం ముద్ర బలంగా ఉంది. ఒకనాడు అన్న గారు పెట్టిన టీడీపీ జెండా మాది అంటూ అన్నింటికీ అతీతంగా అంతా ముందుకువచ్చి పట్టుకున్నారు. ఇపుడు టీడీపీ ఆ ప్రత్యేకతను కోల్పోవడం నిజంగా బాధాకరం. గత వైభవంలా టీడీపీ మిగిలిపోవడం అభిమానులకు తీరని వ్యధగానే ఉంది. అన్ని పార్టీల మాదిరి కాదు, టీడీపీ జనం గుండెల్లో నుంచి పుట్టింది. కనీసం ఇప్పటికైనా ప్రజన గుండె చప్పుడు ఓపికా, తీరిక ఈనాటి నాయకత్వాన్ని ఉంటే మళ్ళీ పూర్వ వైభవం కష్టం కాబోదు.