ఆయన వెనక చంద్రబాబు.. టిక్కెట్ గ్యారంటీ అట
గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. గత టర్మ్‌లో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి విజయం సాధించి.. నవ్యాంధ్ర తొలి [more]
గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. గత టర్మ్‌లో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి విజయం సాధించి.. నవ్యాంధ్ర తొలి [more]
గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. గత టర్మ్‌లో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి విజయం సాధించి.. నవ్యాంధ్ర తొలి స్పీకర్ పదవి చేపట్టారు. 2014 ఎన్నికల్లోనే కోడెల ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం 713 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. గత ఎన్నికల్లో అంబటి 19 వేల ఓట్ల తేడాతో కోడెలను ఓడించి రివేంజ్ తీర్చుకున్నారు. ఆ తర్వాత కోడెల ఆకస్మిక మరణంతో సత్తెనపల్లి టీడీపీ దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. కోడెలకు ఎంత వ్యతిరేకత వచ్చినా ఆయన ఎంత చిత్తుగా ఓడినా సీనియర్ నేత కావడంతో ఆయన ఉండగా సత్తెనపల్లిపై ఎంతో మంది కన్నుపడినా ఇటు చూసే సాహసం కూడా చేయలేకపోయారు.
ట్రయాంగిల్ వార్…..
ఇప్పుడు కోడెల లేకపోవడంతో సత్తెనపల్లి టీడీపీ కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారింది. కోడెల తనయుడు శివరాం ప్రసాద్ వల్లే ఇక్కడ పార్టీ కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శివరాం సైతం వరుస కేసుల్లో చిక్కుకుని కాస్త తేరుకున్నాక ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో తిరుగుతూ పరామర్శలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక ఇదే సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావుతో పాటు యువనేత అబ్బూరి నాగమల్లేశ్వరరావు సైతం రేసులో ఉన్నారు. ఈ ట్రయాంగిల్ వార్ ఇలా నడుస్తుండగానే ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సైతం ఇక్కడ పర్యటనలు చేస్తూ తాను రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు.
బాబు ఆశీస్సులున్నాయా ?
సత్తెనపల్లి నుంచి 1999లో టీడీపీ తరపున చలపతి విద్యాసంస్థల అధినేత వైవి. ఆంజనేయులు ( చలపతి ఆంజనేయులు) విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు బీసీ కోటాలో అప్పటి గుంటూరు కార్పొరేటర్ గా ఉన్న నియ్మకాయల చినరాజనారాయణ యాదవ్‌కు సీటు ఇచ్చి ఆంజనేయులును పక్కన పెట్టారు. 2014 ఎన్నికల్లో ఆయన భారీగా ఖర్చు చేస్తానని తనకు సీటు ఇవ్వాలని బాబును కోరినా… చివరకు కోడెల రంగంలోకి దిగడంతో ఆంజనేయులు ఆశలు అడియాసలు కాక తప్పలేదు. అప్పటి నుంచి తనకు ఛాన్స్ రాదా ? అని వెయిట్ చేస్తున్నారు.
వివాదాలకు దూరంగా…..
సౌమ్యుడు అయిన ఆంజనేయులు వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులతోనే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్న ప్రచారం కూడా స్థానికంగా ఉంది. అక్కడ పార్టీ కేడర్‌లో చాలా మంది కోడెల ఫ్యామిలీ అంటేనే తీవ్ర వ్యతిరేకత భావంతో ఉన్నారు. ఇక రాయపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడ కన్నేసినా పెదకూరపాడు, నరసారావుపేట ఎంపీ సీటును కూడా ఆప్షన్‌గా పెట్టుకుంది.
యాక్టివ్ కావడం వెనక..?
ప్రస్తుతం అక్కడ పార్టీ నాయకత్వ శూన్యత ఏర్పడడంతో దానిని అందిపుచ్చుకుని ఆంజనేయులు మళ్లీ సత్తెనపల్లిలో యాక్టివ్ కావడం స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఆయన యాక్టివ్ కావడం వెనక చంద్రబాబు ఉన్నారన్నదే ఎవ్వరికి అంతు పట్టని వ్యూహంగా ఉంది. ఇక చంద్రబాబు కూడా జిల్లాలో ఖాళీ అయిన నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను భర్తీ చేస్తున్నా సత్తెనపల్లి విషయాన్ని ఏటూ తేల్చుకపోవడం కూడా ఆయన మదిలో ఇక్కడ ఎవరు ఉన్నారో ? అర్థం కాని పరిస్థితి.