ఈ తమ్ముళ్ళకు ఏమైంది? ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారా?
టీడీపీ తీరు చూస్తూంటే తామే ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారో ఏమో. అసలు అధికారం ఎందుకు చేజారిపోయిందో కూడా వారికి తెలియనంతగా మత్తులో ఉన్నారనుకోవాలి. కేవలం 23 సీట్లు [more]
టీడీపీ తీరు చూస్తూంటే తామే ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారో ఏమో. అసలు అధికారం ఎందుకు చేజారిపోయిందో కూడా వారికి తెలియనంతగా మత్తులో ఉన్నారనుకోవాలి. కేవలం 23 సీట్లు [more]
టీడీపీ తీరు చూస్తూంటే తామే ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారో ఏమో. అసలు అధికారం ఎందుకు చేజారిపోయిందో కూడా వారికి తెలియనంతగా మత్తులో ఉన్నారనుకోవాలి. కేవలం 23 సీట్లు తమ పార్టీకి వచ్చాయంటే అందులో జగన్ గొప్పతనం ఎంత ఉందో తమ తప్పులూ అంతే లెక్కన ఉన్నాయని తమ్ముళ్ళకు ఎరుక లేకపోవడమే వింతల్లో కెల్ల వింత. తిరిగే కాలూ, తిట్టే నోరు ఊరికే ఉండవన్నట్లుగా అధికారం చేజారినా తమ్ముళ్ళ నోరు ఎక్కడా ఆగడంలేదు. అసెంబ్లీలో పాతేస్తాను అంటూ గర్జించిన నాయకులు పవర్ పోయాకా అదే రేంజిలో భారీ డైలాగులు కొడుతున్నారు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ బోండా ఉమా మహేశ్వరరావు లాంటి వారు రెచ్చగొట్టుడు ఆగడంలేదుగా.
కూన కానే కాదు….
ఆయన ఇంటిపేరు కూన, ఒంటిపేరు రవికుమార్. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి ఆయన స్వయానా మేనల్లుడు. తమ్మినేని తడబాట్లు, తప్పులు ఆసరాగా చేసుకుని రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించిన కూన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తరువాత చంద్రబాబు దయతో ప్రభుత్వ విప్ గా కూడా పదవిని అందుకున్నారు. సరే టీడీపీ హయాంలో అధికారం చలాయించడం ఒక పధ్ధతి అయితే పవర్ పోయాక కూడా కూడా కూన ఇంకా అదే మిడిసిపాటుతో హల్చల్ చేయడమే అసలైన కధ. ఆయన ఇప్పటికి రెండు మార్లు ఇద్దరు ప్రభుత్వ అధికారుల మీద నోరు పారేసుకుని అరెస్ట్ అయ్యారు. అయినా నా నోరు నాదే, భరించాల్సిందేనని అంటున్నారు.
పాఠాలు నేర్వరా…?
నిజానికి తమ్ముళ్ళు ఎవరూ తాము అధికారంలో లేమని అసలు గ్రహించడంలేదు. తమకు తామే గురువులమని భావించుకుంటున్న వారు పాఠాలు నేర్చుకోవడానికి సిధ్ధంగా లేరు. అహంకారానికి పోతారు. అధినేత తీరే తమకూ ఆదర్శమని అనుకుంటారు. ముఖ్యమంత్రిగా ముమ్మారు పాలించిన చంద్రబాబు ఇంకా తాను అధికారంలో ఉన్నట్లే ఫీల్ అవుతూంటే ఆయన అడుగుజాడలలో నడిచే తమ్ముళ్ళకు మాత్రం ఆ గాలి తాకదా? అందుకే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఓడిపోయినా ఎక్కడా తగ్గడంలేదు. గతంలో ఎంపీడీవో మీద పరుష పదజాలంతో దుర్భాషలాడిన వ్యవహారంలో అరెస్ట్ దాకా వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఈసారి వంతు సరుబుజ్జిలి మండలం ఏవోపీఆర్డీ వెంకటప్పలనాయుడిది. ఆయనకి ఈ టీడీపీ తమ్ముడు ఫోన్ చేసి మరీ నానా దుర్భాషలు ఆడారు. దాంతో కూన మళ్ళీ అరెస్ట్ అయ్యారు.
నేరం నాది కాదు….
ఇక అరెస్ట్ అయినా కూడా కూన రవికుమార్ షరా మామూలుగా గద్దిస్తున్నారు. ఆ గొంతు తనది కాదని అడ్డంగా వాదిస్తున్నారు. పైగా ఆయన ఇదంతా అధికార పార్టీ కుట్రని, పోలీసులు వారికి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ మరింత నోరు చేసుకోవడమే అసలైన విడ్డూరం. అయితే ఈసారి సదరు అధికారి చాలా జాగ్రత్తగా కూన తిట్ల పురాణాన్ని తన ఫోనులో రికార్డు చేశారు. ఒక్క మాట కూడా గాలిలోకి పోకుండా సదరు అధికారి ఆడియో రికార్డు చేయడం, అది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కటై కూన రవికుమార్ మీద విరుచుకుపడ్డాయి. దాంతో తాజా గా ఆయన్ని అరెస్ట్ చేయకతప్పలేదు.
అంతా అంతేగా….
ఇక కూనా, బోండా మాత్రమే కాదు, సీనియర్లు అనిపించుకున్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఆఖరుకు మోస్ట్ సీనియర్ యనమల రామకృష్ణుడు, అలాగే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య వీరంతా కూడా తెల్లారిలేస్తే చాలు జగన్ ని, వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. తమ వాదన బహు గట్టిది అనిపించుకోవడానికి వీరంతా వాడుతున్న భాష ఏ మాత్రం బాగులేదని అంతా అనుకుంటున్నా ఎక్కడా లెక్కచేయడంలేదు. మరి నోరు ఎక్కువ కావడంతోనే అధికారం పోయింది. ఇదే నోరు ఇంతకు ఇంతా పెంచితే ఈసారి ఏమవుతుందో తమ్ముళ్ళే తేల్చుకోవాలని వైసీపీ నేతలు రిటార్ట్ ఇస్తున్నారు.