జగన్ ను ఎవరూ ఆపలేరా?
జగన్ ఎలా పరిపాలిస్తారోనని అందరూ ఊహించారు…. రాజకీయ దురంధరులే జగన్ అంటేనే కొట్టిపారేశారు. కాని నేను శక్తిని, యుక్తిని అని నిరూపించుకుంటున్నారు జగన్. వరుసగా డైనమిక్ డిషిషన్లతో [more]
జగన్ ఎలా పరిపాలిస్తారోనని అందరూ ఊహించారు…. రాజకీయ దురంధరులే జగన్ అంటేనే కొట్టిపారేశారు. కాని నేను శక్తిని, యుక్తిని అని నిరూపించుకుంటున్నారు జగన్. వరుసగా డైనమిక్ డిషిషన్లతో [more]
జగన్ ఎలా పరిపాలిస్తారోనని అందరూ ఊహించారు…. రాజకీయ దురంధరులే జగన్ అంటేనే కొట్టిపారేశారు. కాని నేను శక్తిని, యుక్తిని అని నిరూపించుకుంటున్నారు జగన్. వరుసగా డైనమిక్ డిషిషన్లతో ఎవ్వరూ ఊహించనట్లుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అంతా దట్ ఈజ్ జగన్ అంటూ ముక్కున వేలేసుకోవడమే.
నాడు ఇలా…..
పచ్చని అడవి బతుకులు బూడిదయ్యాయి. మన్యం ఆదివాసులంతా తమ జీవితాలను బుగ్గి చేయొద్దని వేడుకున్నారు. మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించినా …. తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1212 హెక్టార్ల భూమిలో 222.84 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకం కోసం జీవో నెంబర్ 97 ను విడుదల చేసింది.
ఒకే వ్యక్తి….. రెండు నిర్ణయాలు
బాక్సైట్ తవ్వకాలకు జిందాల్, ఆన్రాక్ కంపెనీలకు అనుమతినిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు మావోయిస్టు పార్టీ మరో వైపు తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీలన్నీ ఆందోళనలు నిర్వహించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పుడు వ్యతిరేకించిన తెలుగుదేశం మాత్రం ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక అనుమతులు మంజూరు చేసింది. ఎవ్వరు వ్యతిరేకించినా ఎన్ని పోరాటాలు జరిగినా పోలీసుల సహాయంతో తవ్వకాలు జరపాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు మళ్లీ తవ్వకాలపై నిర్ణయం తీసుకోవడం పట్ల ఏజెన్సీ వాసులు మండిపడ్డారు.
కొనసాగిన పోరాటం….
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్నలు సైతం మండి పడ్డారు. తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు వ్యూహాలు రచించారు. బాక్సైట్ తవ్వకాలవల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక ఆ చుట్టూ పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న అనేక ఆదివాసుల గ్రామాలు జీవనానికి పనికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమైంది. బాక్సైట్ ధూళి ప్రభావంతో ఆదివాసులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు సైతం చెప్పారు. ఇలా బాక్సైట్ తవ్వకాలపై ఆదివాసులు, ప్రతిపక్షాలు పోరాటం చేస్తూనే ఉన్నారు.
మాట కాదు….రాజన్న బాట
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్ట్ ఫారెస్ట్ ప్రాంతంలో అపారమైన బాక్సైట్ ఖనిజ సంపద ఉంది. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గిరిజనుల పోరాటానికి జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్ ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడా మాటను నిలుపుకున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ఇటీవలే చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.