టీజీ బ్యాక్ టు టీడీపీ…. త్వరలోనేనా?
వచ్చే ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఆయన బీజేపీలో కొనసాగుతారా? లేక టీడీపీ మద్దతుదారుగా ఉంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. [more]
వచ్చే ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఆయన బీజేపీలో కొనసాగుతారా? లేక టీడీపీ మద్దతుదారుగా ఉంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. [more]
వచ్చే ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఆయన బీజేపీలో కొనసాగుతారా? లేక టీడీపీ మద్దతుదారుగా ఉంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. టీజీ వెంకటేష్ కర్నూలు నగరంలో బలమైన నేత. వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆర్థికంగా బలంగా ఉండటంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో టీజీ వెంకటేష్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిపోయారు.
ఎన్నికల ఫలితాల తర్వాత….
టీడీపీలో చేరిన వెంటనే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవిని ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలలో టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ ను కర్నూలు నుంచి బరిలోకి దింపారు. అయితే భరత్ ఓటమి పాలు కావడం, రాష్ట్రంలో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. ఆయన కుమారుడు భరత్ మాత్రం కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతుండటం విశేషం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో…..
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా టీజీ వెంకటేష్ పెద్దగా పట్టించుకోలేదు. కుమారుడు టీడీపీ తరుపున ప్రచారం చేస్తుడటంతో ఆయన బీజేపీ తరుపున పెద్దగా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీడీపీ అభ్యర్థిగానే బరిలోకి దిగనున్నారు. గతంలో మాదిరి ఈసారి సీటు గందరగోళం లేదు. ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోవడంతో టీజీ భరత్ కుకర్నూలు సీటు గ్యారంటీ.
కూటమి ఏర్పాటయితే….?
అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడుతుందని టీజీ వెంకటేష్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అదే జరిగితే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా టీడీపీ తిరిగి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం టీజీ వెంకటేష్ కు ఇబ్బందులు తప్పవు. అయితే చివరి నిమిషంలో ఆయన తిరిగి టీడీపీలో చేరే అవకాశాలే ఉన్నాయి. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మరోసారి పార్టీ మారక తప్పేట్లు లేదు. అదే కూటమి బీజేపీతో కలసి ఏర్పాటయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే టీజీ వెంకటేష్ పెద్దగా బీజేపీలో యాక్టివ్ గా లేరంటున్నారు.