ఆయనకు కీలక పదవి.. జగన్ సందేశం ఇదేనా?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు అధికారుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ [more]
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు అధికారుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ [more]
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు అధికారుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ.. ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి ఎండీగా ఉన్న ఆయనను రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీని చేశారు. అయితే.. ప్రభుత్వంలో ఇలాంటి బదిలీలు కామనే అయినప్పటికీ ఠాకూర్‌ను ఇలా అనూహ్యంగా ఒక ప్రాధాన్యతా పోస్టులోకి తీసుకోవడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ హయాంలో….
గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఠాకూర్ డీజీపీగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలో విశాఖలో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. ఈ సమయంలో వైసీపీ నేతలే దీనికి కారణమంటూ.. ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం.. ఠాకూర్‌కు వైసీపీకి మధ్య నిప్పుల కుంపటి రాజేసింది. ఇక ఎన్నికల సమయంలోనూ దూకుడుగా ప్రవర్తించాలని ఠాకూర్.. అనుకున్నా..కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఠాకూర్ సైలెంట్ అయిపోయారు. ఇక, గత ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం కొలువు దీరింది.
ప్రాధాన్యత లేని పోస్టులో….
ఈ నేపథ్యంలో ఠాకూర్‌ను ఉన్నపళాన.. సీఎం జగన్ బదిలీ చేశారు. ఎలాంటి ప్రాధాన్యతా లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో ఎండీగా నియమించారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడే పనిచేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం తనంతట తనే.. ఠాకూర్‌ను కీలకమైన.. ఆర్టీసీ ఎండీ పోస్టులోకి పంపింది. ఇదేమీ యాదృచ్ఛికమో.. లేక అధికారులు లేక చేసిన బదిలీ ఎంతమాత్రమూ కాదు. ఒక వ్యూహం మేరకు ఠాకూర్‌ను ఆర్టీసీలోకి బదిలీ చేశారని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే.. ఖచ్చితంగా మంచి పోస్టులు ఇస్తామనే.. సంకేతాలను పంపిందని అంటున్నారు.
వైఖరి మారిందా?
అంతేకాదు.. గతానికి ఇప్పటికీ.. అధికారుల విషయంలో జగన్ వైఖరి మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం ఫలిస్తే.. రాజకీయంగా జగన్ సక్సెస్ అయినట్టేనని అంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో అలాంటి వాటి నుంచి కూడా తప్పుకొనేందుకు ఠాకూర్ ను వ్యూహాత్మకంగా ఆర్టీసీ పీఠంపై కూర్చోబెట్టిందని అంటున్నారు.