బాబుకు జైలు ఖాయం …. నిజమేనా.?
మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన రోజునుంచి బిజెపి టిడిపి అధినేత పై పదేపదే విరుచుకుపడుతుంది. అందులోను ఒకే అంశాన్ని చెప్పింది చెప్పకుండా [more]
మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన రోజునుంచి బిజెపి టిడిపి అధినేత పై పదేపదే విరుచుకుపడుతుంది. అందులోను ఒకే అంశాన్ని చెప్పింది చెప్పకుండా [more]
మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన రోజునుంచి బిజెపి టిడిపి అధినేత పై పదేపదే విరుచుకుపడుతుంది. అందులోను ఒకే అంశాన్ని చెప్పింది చెప్పకుండా చెబుతుంది. అదే చంద్రబాబు జైలు కు వెళ్లడం ఖాయం అనే వ్యాఖ్య చేస్తూ వస్తుంది కమలం. ఆ పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవర నుంచి కింది స్థాయివరకు ఇదే మాట నడుస్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు తగిన శిక్ష తప్పదని చెబుతూ వస్తుంది. తాజాగా మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మరోసారి చంద్రబాబు కి జైలు జీవితం అంటూ సంచలన వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. దాంతో హాట్ టాపిక్ గా ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
గతంలో చార్జిషీట్ కూడా పెట్టి …
టిడిపి తో పొత్తు లేనప్పుడు బిజెపి చేసే హడావిడి అంతా ఇంతా కాదన్నది చరిత్ర చెబుతుంది. గతంలో వాజ్ పేయి సర్కార్ తొలిసారి కొలువు తీరినప్పుడు బిజెపి టిడిపి పై ఇలాగే ఒంటికాలిపై లేచింది. ఆయనపై ఛార్జ్ షీట్ ఇదిగో అంటూ జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు ఫోటో తో ఫ్లెక్సీలు సైతం వేసి ఎపి అంతా ప్రధాన కూడళ్ల లో హోర్డింగ్ లు పెట్టింది, సభలు నిర్వహించింది. అయితే ఆ తరువాత 99 ఎన్నికల్లో చంద్రబాబు బిజెపి తో పొత్తు పెట్టుకోవడంతో చేసిన ఆరోపణలు అన్ని గాల్లో కలిసి పోయాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 నుంచి నాలుగున్నరేళ్ళు కలిసి అధికారం పంచుకున్న టిడిపి – బిజెపి చక్కగానే కాపురం చేశాయి. ఆ తరువాత ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టిడిపి కమలంపై కత్తులు దూసింది. రాజకీయ లబ్ది కోసం తాపత్రయపడి మోడీ తో దేశ స్థాయిలో పోరాటానికి దిగి చంద్రబాబు ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లు రాక దెబ్బయిపోయారు.
కేంద్ర నాయకులు అలా …
సైకిల్ – కమలాల నడుమ పోరాటం ఆసక్తికరం గా నడుస్తుంది. చంద్రబాబు పై ప్రధానంగా వచ్చిన ఆరోపణలు రాష్ట్ర నేతలు చేసినవి అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ అంశాలు. ఈ కీలకమైన వాటిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చంద్రబాబు సర్కార్ కి క్లిన్ చిట్ ఇచ్చేసింది. అయితే చిత్రంగా ఎపి కమలం నేతలు మాత్రం అక్కడ చెప్పిన వాటికి విభిన్నంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. టిడిపి అధినేత ను జైలుకు పంపిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ మొత్తం రాజకీయ వాతావరణాన్ని అయోమయంలోకి నెడుతున్నారు. ఆ విధంగా ప్రత్యేక హోదా , విభజన హామీలను బిజెపి ఇచ్చి తీరాలన్న ఎపి వాసుల దృష్టిని మళ్లించడానికి ఈ వ్యూహం అనుసరిస్తున్నారా లేక అధిష్టానం ఒకలా రాష్ట్ర నాయకత్వం మరోలా వెళ్ళి తెలుగుదేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.