రాయపాటి బేరం ఇదేనటగా
ఒక్కసారి గోడ దూకడం అలవాటయ్యాక.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు దూకుతూనే ఉండడం రాజకీయ నేతలకు బాగా అబ్బిన విద్య. దేశంలో అత్యధిక శాతం మంది రాజకీయ [more]
ఒక్కసారి గోడ దూకడం అలవాటయ్యాక.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు దూకుతూనే ఉండడం రాజకీయ నేతలకు బాగా అబ్బిన విద్య. దేశంలో అత్యధిక శాతం మంది రాజకీయ [more]
ఒక్కసారి గోడ దూకడం అలవాటయ్యాక.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు దూకుతూనే ఉండడం రాజకీయ నేతలకు బాగా అబ్బిన విద్య. దేశంలో అత్యధిక శాతం మంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి వరుసలో ఉండడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి జై కొట్టడం అనేది గత పదేళ్లుగా చూస్తేనే ఉన్నాం. ఇక, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ పరిస్థి తిని అధికారంలో ఉన్న పార్టీలే భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం కూడా ఫిరాయింపులను, గోడదూకుళ్లను భారీగా పెంచాయి. పోషించాయి. దీంతో పార్టీలకు పార్టీలే ఈ రెండు రాష్ట్రాల్లో కనుమరుగైన పరిస్థితి కనిపించింది.
ప్రాణం ఊరుకుంటుందా…?
ఇలా ఒకసారి ఫిరాయించేందుకు అలవాటు పడిన ప్రాణం..ఊరుకుంటుందా? తమకు అవసరం ఉన్న చోటుకి, తమకు అవకాశం ఉన్న చోటుకి ఖచ్చితంగా ఫిరాయించేందుకు నాయకులు రెడీ అయ్యారు. టీడీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎంపీలు జంప్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మాజీలు కూడా రెడీ అయ్యారు. వీరిలో తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయాలు చేసిన నాయకుడు రాయపాటి సాంబశివరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీనిని ఆయన ఖండించకపోవడం గమనార్హం. తాజాగా ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు బాహాటంగానే చెప్పారు.
ఆఫర్లు ఇవే….
ఇక, ఇప్పటికే రాయపాటి సాంబశివరావు పార్టీ మార్పులపై ఊహాగానాలు రాసిన మీడియా మరికొంత లోతుగా దీనిపై రాత్రిరాత్రే అధ్యయనం చేయగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. బీజేపీ.. రాయపాటి సాంబశివరావుకి బాగా టచ్లో ఉందని తెలిసింది. అంతేకాదు, రాయపాటి సాంబశివరావు ప్రభావం దాదాపు గుంటూరులోని 4 నుంచి ఐదు నియోజకవర్గాల్లో ఉండడం, ఆయన చేతిలో కీలకమైన నాయకులు ఉండడంతో రాయపాటి సాంబశివరావు లాంటివాడిని పార్టీలో చేర్చుకుంటే తమ ఎదుగుదల సునాయాశంగా ఉంటుందని భావించినట్టు తెలిసింది. ఇక ఆయనకు అటు పదవితో పాటు ఇటు కుమారుడి భవిష్యత్తు… ఆయన వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా ఉండడం అనేక ఉపయోగాలు ఉన్నాయి. లాసుల్లో ఉన్న వ్యాపారాలు గట్టెక్కేందుకు హామీ లభించిందంటున్నారు. ఈ క్రమంలోనే రాయపాటి సాంబశివరావుకు రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేసినట్టు తెలిసింది. దీంతో రాయపాటి సాంబశివరావు త్వరలోనే పార్టీ మారుతున్నారని కన్ఫర్మ్ అయింది. ఏదేమైనా.. అవసరం-అవకాశం నేతలను ఎటైనా నడిపిస్తాయనడానికి ఇది చక్కని ఉదాహరణగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.