వేదం కరోనాను తరిమికొడుతుందా …?
అనేక మతాలు, వేల కులాలు భిన్నమైన రుచులు ఇలా భిన్నత్వం లో ఏకత్వాన్ని చూపించే దేశం భారత్. అయితే మతాలు ఎన్ని ఉన్నా వేదభూమి గా ప్రపంచం [more]
అనేక మతాలు, వేల కులాలు భిన్నమైన రుచులు ఇలా భిన్నత్వం లో ఏకత్వాన్ని చూపించే దేశం భారత్. అయితే మతాలు ఎన్ని ఉన్నా వేదభూమి గా ప్రపంచం [more]
అనేక మతాలు, వేల కులాలు భిన్నమైన రుచులు ఇలా భిన్నత్వం లో ఏకత్వాన్ని చూపించే దేశం భారత్. అయితే మతాలు ఎన్ని ఉన్నా వేదభూమి గా ప్రపంచం గుర్తించే మన దేశానికి వుండే నమ్మకాలు అన్ని ఇన్ని కావు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి వేదాలు మూలాధారం. చతుర్వేదాలు పంచభూతాలను నియంత్రిస్తూ సకల చరా చర సృష్టిని కాపాడతాయని దేవుడిని విశ్వసించే మెజారిటీ హిందువుల నమ్మకం. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేశాక అంతా ఇప్పుడు భారతీయుల జీవన విధానం సర్వోత్తమం అని ఏకగ్రీవంగా అంగీకరించే పరిస్థితి వచ్చింది. దీనికి కులాలు, మతాలు ఏమీ అడ్డు రాకుండా కోవిడ్ ను తిప్పికొట్టాలంటే భారతీయ మూల మంత్రాలే శరణ్యం అని చెప్పేస్తున్నారు.
వేదం శరణం గచ్ఛామి …
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు హిందువుల వేదాలను నమ్ముకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తో స్నేహ ప్రభావమో ఏమో కానీ వైట్ హౌస్ లో వేదపఠనం చేయించారు ప్రపంచ పెద్దన్న. అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతుల పై ఇప్పటికే అంతా అనుసరణీయం అంటున్న రోజులు ఇప్పుడు మొదలైపోయాయి. దీనికి మార్కెటింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందర్భాల్లో ప్రమోషన్ వర్క్ చేసేసారు కూడా. తాజాగా ఈ వేద పఠనం ట్రంప్ చేయించడం తో మన వేద పండితులకు ఇప్పుడు మరింత డిమాండ్ తో బాటు భారతీయం ప్రపంచమయం కానుంది అనే చెప్పాలి.
నమస్కారమే మన సంస్కారం …
భారతీయులు తమకు ఎదురైన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ నమస్కారం అంటూ రెండు చేతులు జోడిస్తారు. వారిని ఆలింగనాలు చేసుకోవడం, చుంబించడం వంటివి మన సంస్కృతిలో భాగం కాదు. అదే విధంగా ఇంటికి వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్లినా కాళ్ళు చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత కు నిదర్శనం. ఇక మన వంటింటి లో వాడే పసుపు, శొంఠి వంటివి యాంటీబయాటిక్స్ గా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి.
మంచి అలవాట్లతో….
అలాగే విదేశీ జీవన విధానం మనలో అంతర్భాగం కానప్పుడు బయట తయారు చేసే ఆహారం ఎవ్వరు భుజించేవారు కాదు. బ్రిటిషర్లు వచ్చి వెళ్ళాకా మాత్రమే అల్పాహారం విధానం అలవాటు చేసుకున్నారు భారతీయులు అంతకుముందు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు భోజనాలు పూర్తి అయ్యేవి. ఇలాంటి మంచి అలవాట్లు నుంచి క్రమంగా విదేశీ అలవాట్ల మోజు లో పడి నగర పట్టణాలనుంచి, గ్రామాల వరకు జీవన విధానాల్లో మార్పులు మొదలు అయ్యాయి. అయితే కరోనా వచ్చాకా అంతా ఇప్పుడు తాతలు చూపిన బాటలో వేడితేనే బలుసాకు తినొచ్చని అర్ధమైంది అందరికి.