ఆషాఢం..ఆగస్టు…టెన్షన్ టెన్షన్
ఆషాఢం ముగియనుండటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకూ ఆషాఢమాసం ఉందని చాలా మంది నేతలు పార్టీ మారేందుకు ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా [more]
ఆషాఢం ముగియనుండటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకూ ఆషాఢమాసం ఉందని చాలా మంది నేతలు పార్టీ మారేందుకు ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా [more]
ఆషాఢం ముగియనుండటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకూ ఆషాఢమాసం ఉందని చాలా మంది నేతలు పార్టీ మారేందుకు ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఆషాఢం వల్ల కొంత వెసులుబాటు కలిగింది. కొందరు నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లాలన్నా ఆషాఢం అడ్డురావడంతో ప్రస్తుతానికి గుడ్ బై చెప్పడాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆషాఢం ఆందోళన ప్రారంభమయింది.
శ్రావణమాసం వస్తుండటంతో….
ఆషాఢం ఈ నెల 2వ తేదీ తర్వాత వెళ్లిపోతుంది. శ్రావణ మాసం వస్తుండటంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారనున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు కొందరు శ్రావణమాసంలో కాషాయకండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు.
వైసీపీలోకి కొందరు….
ఇక కొందరు తెలుగుదేశం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకుకూడా రెడీ అయిపోయారు. వీర శివారెడ్డితో పాటు గౌరు చరితా రెడ్డి దంపతులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. గౌరు చరితారెడ్డి దంపతులు గత ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో తిరిగి సొంత గూటికి వెళ్లాలని వారు ప్రయత్నిస్తున్నారు. జగన్ కూడా వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. శ్రావణ మాసంలోనే వీరి చేరిక ఉంటుందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఆగస్టు సంక్షోభం గుర్తుకొచ్చి…..
ఆషాఢం వెళ్లిపోవడంతో పాటు ఆగస్టు నెల కూడా రావడం తెలుగుదేశం పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఆగస్టు అంటేనే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాల నెలగా భావిస్తారు. ఈ నెలలో ఎలాంటి సంక్షోభాలను పార్టీ ఎదుర్కొనాల్సి వస్తోందోనన్న ఆందోళన సీనియర్ నేతల్లోనూ కనపడుతోంది. అంతేకాదు ఎంతమంది నేతలు పార్టీని వీడివెళాతారోనన్న టెన్షన్ కూడా పార్టీకి పట్టుకుంది. మొత్తం మీద ఆషాఢం వెళ్లిపోవడం, ఆగస్టు నెల రావడంతో పసుపు పార్టీ నేతల్లో వణుకు ప్రారంభమయింది.