సెట్ చేసేది ఈయనేనటగా
నాదెండ్ల మనోహర్ … జనసేనలో కీలక నేత. ఆయన పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ సయితం మంచి ప్రయారిటీనే ఇస్తున్నారు. ఇటీవల నియమించిన పార్టీ [more]
నాదెండ్ల మనోహర్ … జనసేనలో కీలక నేత. ఆయన పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ సయితం మంచి ప్రయారిటీనే ఇస్తున్నారు. ఇటీవల నియమించిన పార్టీ [more]
నాదెండ్ల మనోహర్ … జనసేనలో కీలక నేత. ఆయన పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ సయితం మంచి ప్రయారిటీనే ఇస్తున్నారు. ఇటీవల నియమించిన పార్టీ కీలక కమిటీలో కూడా నాదెండ్ల మనోహర్ పేరునే పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేనలో నెంబరు 2 స్థానం నాదెండ్ల మనోహర్ దేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ఎక్కడకు వెళ్లినా…చివరకు అమెరికాలోనూ నాదెండ్ల తోడుగా ఉంటున్నారు. అలాంటి నాదెండ్ల మనోహర్ రాబోయే రాజకీయ పరిణామాలకు కీలకంగా మారబోతున్నారట.
సన్నిహితుల్లో ఒకరు….
అవును… పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పవన్ కల్యాణ్ మొదట సంప్రదించేది నాదెండ్ల మనోహర్ నే. అందుకే ఆయన భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారబోతున్నారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ కు గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కినా కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న నేత. ఆయన తోడు ఎవరైనా కావాలనుకుంటారు.
స్థానిక సంస్థల ఎన్నికల నుంచే….
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పాత్తు పెట్టుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. అందులో మొదట విన్పించే పేరు చంద్రబాబునాయుడు. గత ఎన్నికల్లోనే చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు కోసం పరితపించారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో పవన్ అంగీకరించలేదు. నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్లు కొంత సముదాయించేందుకు ప్రయత్నించినా పవన్ అంగీకరించకపోవడానికి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నదే కారణమని చెప్పక తప్పదు.
టీడీపీతో కలిపే పనిని…..
ఇక త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇప్పుడు పవన్ తో సాన్నిహిత్యం ఆ పార్టీకి అవసరం కూడా. నేతలు, క్యాడర్ లో నిస్తేజాన్ని తరిమికొట్టాలంటే పవన్ తో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబునాయుడు వచ్చారట. ఇందుకోసం నాదెండ్ల మనోహర్ వద్దకు కొందరు టీడీపీ నేతలను పంపారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కలసి పనిచేయాలని, ఐక్యంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని టీడీపీ నేతలు నాదెండ్ల మనోహర్ చెవిలో వేశారని టాక్. నాదెండ్ల మనోహర్ మాత్రమే పవన్ ను ఒప్పింగలరన్న నమ్మకంతో ఆయనపై ఈ బాధ్యతను టీడీపీ నేతలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి పవన్ ఇందుకు అంగీకరిస్తారా? లేదా? చూడాలి.