మంచి చేసుకోవడానికే వచ్చారా?
చైనా అధినేత అంతర్జాతీయంగా కీలకమైన నాయకుడు. ఆయన మాటలకు, చేతలకు, పర్యటనలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశాధినేతగా, ప్రపంచంలోనే రెండో [more]
చైనా అధినేత అంతర్జాతీయంగా కీలకమైన నాయకుడు. ఆయన మాటలకు, చేతలకు, పర్యటనలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశాధినేతగా, ప్రపంచంలోనే రెండో [more]
చైనా అధినేత అంతర్జాతీయంగా కీలకమైన నాయకుడు. ఆయన మాటలకు, చేతలకు, పర్యటనలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశాధినేతగా, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల అధినేతగా, భద్రతామండలిలో గల అయిదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో ఒకటిగా చైనా అధినేత నిస్సంహదేహంగా కీలకమైన నాయకుడు. అమెరికా అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, చైనా అధినేతకూ దాదాపు అదే ప్రాధాన్యత ఉంటుంది. దేశాధినేతగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అధిపతిగా చక్రం తిప్పుతున్న షి జిన్ పింగ్ ఎవరు కాదన్నా ఔనన్నా అంతర్జాతీయంగా శక్తిమంతమైన నాయకుడు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండక్కర్లేదు.
మూడు దశాబ్దాల తర్వాత…?
ఇటీవల జులై 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు టిబెట్ లో జిన్ పింగ్ పర్యటన చైనాలోనే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. టిబెట్ …చైనాలోని స్వయం ప్రతిపత్తి గల ప్రావిన్స్. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలో ఉండే టిబెట్ 1950ల్లో చైనా పరమైంది. టిబెట్ … చైనాలో అంతర్భాగమన్న విషయాన్ని భారత్ సైతం అధికారికంగా గుర్తించింది. అంతర్జాతీయ సమాజానిదీ అదే అభిప్రాయం. అయితే భారత్ లోని బౌద్ధ మతం గురువు దలైలామా వంటి వారు అప్పుడప్పుడూ టిబెట్ గురించి మాట్లాడటం వల్ల ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కుతుంటోంది. తాజాగా జిన్ పింగ్ టిబెట్ పర్యటన అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణాలు లేకపోలేదు. మూడు దశాబ్దాల తరవాత టిబెట్ ను సందర్శించిన తొలి చైనా అధినేతగా జిన్ పింగ్ గుర్తింపు పొందారు.
1991 తర్వాత…?
గతంలో అంటే 1991లో అప్పటి అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ తరవాత టిబెట్ లో పర్యటించిన తొలి బీజింగ్ అధినేత జిన్ పింగ్ కావడం విశేషం. భారత్ లోని తూర్పు లద్దాఖ్ కు అత్యంత సమీపంలో టిబెట్ ఉంటుంది. ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనావైపు సైతం భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ పర్యటన కీలకంగా మారింది. టిబెట్ లోని నియింగ్చి విమానాశ్రయంలో కాలుమోపిన జిన్ పింగ్ అక్కడి నుంచి యార్లుంగ్ జాంగ్బో నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించారు. నియింగ్చి విమానాశ్రయం మన అరుణాచల్ ప్రదేశ్ కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. యార్లుంగ్ జాంగ్బో నదినే భారత్ లో బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. టిబెట్ నుంచి అరుణచాల్ ప్రదేశ్, అసోం మీదుగా ప్రవహించే ఈ నది బంగ్లాదేశ్ లో బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ నదిపై చైనా అనేక వివాదాస్పద ప్రాజెక్టులను నిర్మిస్తూ భారత్ నీటి వాటాకు గండి కొడుతోంది.
ప్రసన్నం చేసుకునేందుకే…?
అనంతరం జిన్ పింగ్ కొత్తగా నిర్మించిన సిచువాన్ – లాసా రైల్వై లైనును పరిశీలించారు. లాసా టిబెట్ రాజధాని నగరం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ మార్గంలో రైళ్లు ప్రయాణిస్తాయి. గత కొంతకాలంగా చైనా తమను అణచివేస్తుందన్న భావన టిబెట్ ప్రజల్లో ఉంది. బలవంతంగా చైనా సంస్ర్కతిని తమపై రుద్దుతున్నారన్న భావన వారిలో ఉంది. స్థానిక భాష బదులు చైనా అధికారిక భాష అయిన ‘మాండరిస్’ నేర్చుకోవాలన్న ఒత్తిడి వారిపై చేస్తున్నారు. చైనా సైన్యంలో చేరాలన్న ఒత్తిడి కూడా వారిపై ఉంది. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నాన్న అనుమానం వారిలో ఉంది. ఈ నేపథ్యంలో టిబెట్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు, వారికి గల అనుమానాలు, అపోహలను తొలగించేందుకు జిన్ పింగ్ పర్యటించారన్న వాదనలు వినపడుతున్నాయి. సరిహద్దుల్లో ఉభయ దేశాల మధ్య విస్తరించిన 3,488 కిలోమీటర్లు గల వాస్తవాధీన రేఖ వెంట తాజాగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన తరుణంలో చైనా అధినేత పర్యటనను భారత్ నిఘావర్గాలు నిశితంగా గమనించాయి.
-ఎడిటోరియల్ డెస్క్