ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎటువైపో?
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్, అమెరికా ముఖ్యమైనవి. భారత్ పార్లమెంటరీ వ్యవస్థను అవలంబిస్తోంది. ఇక్కడ పౌరులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓటేస్తారు. అమెరికాది అధ్యక్ష ప్రజాస్వామ్య విధానం. [more]
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్, అమెరికా ముఖ్యమైనవి. భారత్ పార్లమెంటరీ వ్యవస్థను అవలంబిస్తోంది. ఇక్కడ పౌరులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓటేస్తారు. అమెరికాది అధ్యక్ష ప్రజాస్వామ్య విధానం. [more]
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్, అమెరికా ముఖ్యమైనవి. భారత్ పార్లమెంటరీ వ్యవస్థను అవలంబిస్తోంది. ఇక్కడ పౌరులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓటేస్తారు. అమెరికాది అధ్యక్ష ప్రజాస్వామ్య విధానం. ఆ దేశంలో ప్రజలు అధ్యక్షుడిని పరోక్షంగా ఎన్నుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే కొంచెం అటుఇటుగా మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక లాంటిది. అయితే భారత్ లో రాష్ర్టపతిని ఎన్నికైన ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.
మ్యాజిక్ ఫిగర్ 278….
అమెరికాలో ప్రజల చేత ఎన్నికైన ఎలక్టోరల్ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంటే పరోక్ష ఎన్నిక. సాధారణ పౌరుడికి ఈ ప్రక్రియ ఒక పట్టాన అర్థం కాదు. దేశంలోని మొత్తం 50 రాష్రాల నుంచి ఎన్నికైన 538 ఎలక్టోరల్ కాలేజీలో ఏ పార్టీ అభ్యర్థికి 278 ఓట్లు లభిస్తే అతనే అధ్యక్షుడ వుతారు. అంటే అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోరన్నది స్పష్టమవుతుంది. అందువల్లే అమెరికాది పరోక్ష అధ్యక్ష విధానమని చెప్పవచ్చు. ఈ విధానంలో ప్రజల కన్నా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులే కీలకం అవుతారు. వారి మీదనే అధ్యక్ష అభ్యర్థులు ఆధార పడతారు. ఈ ప్రక్రియలో ముందుగా అందరి దృష్టి ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలపైనే ఉంటుంది. మన దేశంలో యూపీ, ఎంపీ, మహారాష్ర్ట తమిళనాడు, బిహార్ వంటి పెద్ద రాష్రాలు, గోవా, సిక్కిం, మేఘాలయ, నాగాలండ్ వంటి చిన్న రాష్టాలున్నట్లు అమెరికాలోనూ ఉన్నాయి. మన దేశంలో 80 సీట్లున్న యూపీ పెద్ద రాష్ర్టం. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలవని పార్టీ కేంద్రంలో అధికారం సాధించడం కష్టం. మనలాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ర్టం ఎలక్టోరల్ కాలేజీలో అత్యధికంగా 55 మంది సభ్యులు ఉన్నారు. 38 మంది సభ్యులతో టెక్సాస్ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్రం మెక్సికో సరిహద్దుల్లో ఉంది. మెక్సికో నుంచి టెక్సాస్ కు వలసలు అత్యధికంగా ఉంటాయి. అక్రమ వలసలను అరికట్టడానికి రెండు దేశాల మధ్య పెద్ద రక్షణ గోడ కట్టాలని ఆలోచన చేశారు. దీనిపై స్వదేశంలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా ట్రంప్ లెక్క చేయలేదు.
ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులపైనే…..
దీంతో అమెరికా అంతటా సహజంగానే ఈ రెండు పెద్ద రాష్టాల్లో జరిగే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఎన్నికపైనే దష్టి ఆసక్తి ఉంటుంది. వీటితోపాటు అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే మరికొన్ని రాష్టాలు ఉన్నాయి. వీటినే స్వింగ్ స్టేట్స్ అని వ్యవహరిస్తారు. అంటే చివరి నిమిషం వరకు ఓటర్లు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్టాలు. అదే సమయంలో ఎక్కువ మంది ఎలక్టోరల్ సభ్యులున్న రాష్టాలని కూడా చెబుతుంటారు. ఇటువంటి రాష్టాలు 14 ఉన్నాయి. టెక్సాస్ (38), మిచిగాన్ (16), పెన్సిల్వేనియా (20) , విస్కాన్సిన్ (10), ఫ్లోరిడా (29), జార్జియా (16), మిన్నెసోటా (10), అరిజోనా (11), ఉత్తర కరోలినా (15), నెవడా (6), అయోవా (6), న్యూ హాంపైర్ (4), ఓహియో (18), వర్జీనియా ( 13) రాష్రాలని స్వింగ్ స్టేట్స్ గా పేరొందాయి. వీటిల్లో ప్రజాబిప్రాయం స్థిరంగా ఉండదు.
డాలర్ల వరద పారిస్తూ…..
తరచూ మారుతుంటుంది. ఈ రాష్రా ల్లో ప్రచారం కోసం ప్రధాన పార్టీలు రెండూ డాలర్ల వరద పారిస్తున్నాయి. ఎన్నికల్లో జాతీయస్థాయిలో ప్రజాదరణ పొందినవారే దేశాధినేత కాగలరన్న నమ్మకం లేదు. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కు పాపులర్ ఓట్లు దాదాపు 30 లక్షలు అధికంగా వచ్చాయి. అయితే ఎలక్టోరల్ కాలేజీలో ట్రంప్ కే అధిక ఓట్లు వచ్చాయి. దీంతో అధికార పగ్గాలు ఆయనకే దక్కాయి. దీనిని బట్టి ఎలక్టోరల్కాలేజీ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లున్న ఈ 14 స్వింగ్ స్టేట్స్ పైనా ఎక్కవగా దష్టి కేంద్రీకరిస్తున్నాయి. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. 46వ అధ్యక్ష ఎన్నిక అంతా ఈ రాష్రాల చుట్టూనే తిరుగుతోంది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జార విడచుకోవడం లేదు. యావత్తు పార్టీ యంత్రాంగాన్ని మోహరిస్తున్నాయి.