టీడీపీలో వారు సైలంట్.. రీజనేంటి…?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చాలా మంది పాత నేతలు ఉన్నారు. దాదాపు సుదీర్ఘ కాలంగా టీడీపీని పట్టుకుని వేలాడుతున్న రాజకీయ కుటుంబాలే ఉన్నాయి. అనేక పదవులు అలంకరించారు. [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చాలా మంది పాత నేతలు ఉన్నారు. దాదాపు సుదీర్ఘ కాలంగా టీడీపీని పట్టుకుని వేలాడుతున్న రాజకీయ కుటుంబాలే ఉన్నాయి. అనేక పదవులు అలంకరించారు. [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చాలా మంది పాత నేతలు ఉన్నారు. దాదాపు సుదీర్ఘ కాలంగా టీడీపీని పట్టుకుని వేలాడుతున్న రాజకీయ కుటుంబాలే ఉన్నాయి. అనేక పదవులు అలంకరించారు. అనేక విధాల పార్టీ నుంచి అనేక రూపాల్లో సేవలు పొందారు. అయినా ఇప్పుడు ఏ ఒక్కరూ వీరిలో ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. పార్టీ మాది.,. పార్టీ నాయకుడు మావాడు.. అని కాలర్ ఎగరేసి చెప్పుకున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు కూడా ఇప్పుడు ఇంటి గడప దాటి బయటకు వచ్చి కార్యకర్తల్లో ధైర్యం నింపే పని చేయకపోగా, పార్టీ తరఫున బలమైన గళం వినిపించే సాహసం కూడా చేయడం లేదు.
అధికారంలో ఉన్నప్పుడు…..
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవుల కోసం ఈ సామాజిక వర్గం నాయకులు చంద్రబాబును కాకా పట్టిన విషయం అందరికీ తెలిసిందే. తన కేబినెట్లో మంత్రి పదవుల నుంచి చంద్రబాబు సలహాలు ఇచ్చే వరకు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కీలకంగా మారారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సామాజిక వర్గం హవా తెలుగుదేశం పార్టీలో ఓ రేంజ్లో సాగింది. చంద్రబాబు ఆదేశాలను కూడా ఒక దశలో పక్కన పెట్టి పూర్తిగా తమ ఎజెండానే అమలు చేసిన ఈ నాయకులు నియోజకవర్గాల్లో తమకు ప్రత్యామ్నాయంగా మరో నేతను కూడా ఎదగనివ్వలేదనేది వాస్తవం.
ఒక్కరూ బయటకు రాకుండా….
మరి ఇంతలా పార్టీని వాడుకుని పదవులు, ఆస్తులు పోగేసుకున్న ఈ నాయకులు ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ కేడర్లో ధైర్యం పెంచేందుకు చేస్తున్న కసరత్తు ఏమైనా ఉందా? మరోపక్క, అధికార పక్షం దూకుడు ప్రదర్శిస్తూ విపక్షం తెలుగు దేశంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా వాటిని ఖండించేందుకు, కౌంటర్లు ఇచ్చేందుకు కమ్మ వర్గానికి చెందిన నాయకులు ఏ ఒక్కరైనా బయటకు వస్తున్నారా? అంటే.. లేరనే చెప్పాలి. ఎన్నికల అనంతరం కొన్ని రోజుల పాటు గళం విప్పిన తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా తర్వాత కాలంలో మౌనం వహించారు.
కన్పించకుండా… మౌనంగా….
ఇక, గుంటూరులో తమ హవా చలాయించిన యరపతినేని శ్రీనివాసరావుకానీ, వినుకొండ నుంచి వరుస విజయాలు సాధించి తాజా ఎన్నికల్లో చతికిలపడ్డ ఆంజనేయులు కానీ, పొన్నూరు నుంచి ఐదుసార్లు గెలిచి ఓడిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కానీ, , చిలకలూరిపేట నుంచి ఓడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కానీ, పశ్చిమ గోదావరిలో తనకు తిరుగేలేదన్న చింతమనేని ప్రభాకర్కానీ, ఏలూరు ఎంపీగా ఓడిన మాగంటి బాబు కానీ తెలుగుదేశం పార్టీలో మనకు ఎక్కడా కనిపించడం లేదు. అంటే.. దీనిని బట్టి .. చంద్రబాబు టీంలో ఎవరు పనిచేస్తారు? ఎవరు అవకాశం కోసం ఎదురు చూస్తారు? అనే విషయాన్ని ఇప్పటికైనా బాబు గ్రహిస్తే బెటర్ అంటున్నారు పరిశీలకులు.