చివరి గానే వారి వ్యాపారం …? మార్పు తెచ్చిన తీర్పు ఇదే?
సినిమా షూటింగ్స్ లేవు. థియేటర్లు మూత పడిపోయాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఇక సినీ ఫైనాన్సర్స్ కి బాకీలు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియని [more]
సినిమా షూటింగ్స్ లేవు. థియేటర్లు మూత పడిపోయాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఇక సినీ ఫైనాన్సర్స్ కి బాకీలు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియని [more]
సినిమా షూటింగ్స్ లేవు. థియేటర్లు మూత పడిపోయాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఇక సినీ ఫైనాన్సర్స్ కి బాకీలు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియని అయోమయం. ప్రస్తుత కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ఎత్తివేసినా చిట్టచివరి వరకు ఆంక్షల్లో ఉండేది సినిమారంగమే. ఈ నేపథ్యంలో దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది రోడ్డున పడే అవకాశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సాయం అందిస్తున్నా …
బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమ పై ఆధారపడిన వర్గాలను ప్రస్తుతం కొందరు ముందుకు వచ్చి ఆడుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆయా కళాకారుల సంస్థలకు భారీగా సెలబ్రెటీలు విరాళాలు ఇస్తున్నా అవి కొంతకాలం వరకే ఈ రంగంపై ఆధారపడిన వారిని ఆదుకుంటాయి. ప్రభుత్వ పరంగా కూడా భారీ రాయితీలు, కళారంగంపై ఉన్న పేదవర్గాల పెద్ద మనసుతో ఆదుకోవాలి.
డిజిటల్ మీడియా నే శరణ్యం …
ప్రస్తుత కష్టకాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని కళారంగం లో ఉన్నవారు కష్టాల గట్టు దాటి బయటపడే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడివారు అక్కడే ఉండి ఇటీవల చిరంజీవి, నాగార్జున వంటివారు కరోనా వైరస్ పై చైతన్యం తెచ్చే చక్కటి పాటను ప్రజల్లో కి వదిలారు. ఇక అమితాబ్ బచ్చన్ వివిధ రాష్ట్రాల్లో టాప్ హీరోలు రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి వంటివారితో తో చిన్న డాక్యుమెంటరీ తీసిన వైనం గమనిస్తే సినిమా రంగంలో రాబోయే మార్పులకు ఇది సూచికగా నిలుస్తుంది.
థియేటర్లు తెరుచుకున్నా….
థియేటర్లు తిరిగి తెరుచుకున్నా సామాజిక దూరం పాటించేలా దూరం దూరంగా సీట్లు వదిలి కూర్చునే ప్రక్రియ కొనసాగనుంది. దీనివల్ల టికెట్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా కళాకారులు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, టివి సీరియల్స్ , టివి కామెడీ షోస్ మీదే దృష్టి సారించక తప్పదు. మొబైల్ ప్రేక్షకుల లక్ష్యంగానే అన్ని కార్యక్రమాలు షూట్ చేయకతప్పదు. ఏది ఏమైనా మార్పు కాలం ఇచ్చే తీర్పు. దీన్ని శిరసావహించే వారే ముందుకు పోతారు. లేకపోతే రోడ్డునే పడనున్నారు.