సింబల్ సమస్యగా మారనుందా?
ఏ ఎన్నకలయినా గుర్తు ప్రధానం. ప్రజలు ఓట్లేసేది గుర్తు చూసి మాత్రమే. సింబల్ ప్రతి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు ప్రజల్లో బలంగా [more]
ఏ ఎన్నకలయినా గుర్తు ప్రధానం. ప్రజలు ఓట్లేసేది గుర్తు చూసి మాత్రమే. సింబల్ ప్రతి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు ప్రజల్లో బలంగా [more]
ఏ ఎన్నకలయినా గుర్తు ప్రధానం. ప్రజలు ఓట్లేసేది గుర్తు చూసి మాత్రమే. సింబల్ ప్రతి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు ప్రజల్లో బలంగా పాతుకుపోయిన తమ “ముద్ర” ను చెరిగిపోకుండా కాపాడుకుంటాయి. పార్టీ మనుగడ కూడా గుర్తు మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలలో గుర్తు ల విషయం కూటమిలో ఇబ్బందిగా మారింది. ప్రధానంగా డీఎంకేలో గుర్తు అంశం చర్చనీయాంశమైంది.
సీట్ల సర్దుబాటులో…..
డీఎంకే కూటమిలో అనేక పార్టీలున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో కూటమిలోని పార్టీలకు డీఎంకే స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. సీట్ల సర్దుబాటు అంశం ఇంకా డీఎంకేలో కొలిక్కి రాలేదు. ఈసారి వీలయినన్ని తక్కువ స్థానాలను తమ మిత్ర పక్షాలకు కేటాయించాలన్న ఆలోచనలో డీఎంకే ఉంది. అధికారంలోకి వస్తామన్న నమ్మకమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అందుకే తక్కువ స్థానాలతో సరిపెట్టాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు.
కాంగ్రెస్ కు మినహాయింపు….
డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ప్రధాన మిత్రపక్షం. దీంతో పాటు ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఐయూఎంల్, మణిదనేయ మక్కల్ కట్చి పార్టీలున్నాయి. అంటే డీఎంకే కాకుడా ఆరు పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నింటీకి సీట్ల సర్దుబాటును చేయాల్సి ఉంది. ఈసారి డీఎంకే ది అధికారం ఖాయమన్న సర్వే ఫలితాలతో ఎక్కువ స్థానాలను డీఎంకే మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. తమకు పట్టున్న ప్రాంతాల జాబితాను ఇప్పటికే డీఎంకేకు ఆ పార్టీలు సమర్పించినట్లు తెలుస్తోంది.
తమ గుర్తుపైనే అంటూ….
అయితే గత కొంతకాలంగా డీఎంకే అధినేత స్టాలిన్ మిత్ర పక్షాలు ఎవరైనా తమ గుర్తుపై పోటీ చేయాలని చెబుతూ వస్తున్నారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ ఇందులో మినహాయింపు ఉండే అవకాశాలున్నాయి. మిగిలిన చిన్నా చితకా పార్టీలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వబోనంటున్నారు. కానీ ఇందుకు ఆ పార్టీలు అంగీకరించడం లేదు. పార్లమెంటు ఎన్నికలలో ఈ ఫార్ములానే స్టాలిన్ పాటించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తుపైనే పోటీ చేస్తామని చెబుతున్నాయి. మొత్తం మీద ఈ అంశం డీఎంకేకు చికాకు తప్పేట్లు లేదు.