ఏపీలో “రియల్” ధరలు దారుణంగా పడిపోయాయా?
నిజంగా ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు పడిపోయాయా? తెలంగాణలో కంటే చీప్ గా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారా? అవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న [more]
నిజంగా ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు పడిపోయాయా? తెలంగాణలో కంటే చీప్ గా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారా? అవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న [more]
నిజంగా ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలు పడిపోయాయా? తెలంగాణలో కంటే చీప్ గా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారా? అవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలు వింటే నిజమేననిపిస్తుంది. అయితే తెలంగాణలో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అన్న దానికి సమాధానం లేదు. ప్రచారం చేయడంలో చంద్రబాబు ముందుంటారు. కేసీఆర్ అన్న ఒక్క మాటను పట్టుకుని చంద్రబాబు ఏపీలో భూముల ధరలు బాగా పడిపోయాయన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎకరాలు కొనవచ్చని చెబుతున్నారు.
హైదరాబాద్ లో భూమి….
నిజానికి తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న భూమికి, విజయవాడలో ఉన్న భూమికి చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా పెద్ద తేడా ఉండదు. హైదరాబాద్ లో భూమికే వాల్యూ ఉంటుంది. అక్కడి వాతావరణం, ఉపాధి అవకాశాలు, జనసాంద్రతను బట్టి హైదరాబాద్ లో భూముల ధరలు పెరిగిపోయాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు వంటి సౌకర్యాలతో హైదరాబాద్ భూముల ధరలకు ఎప్పుడో రెక్కలు వచ్చాయి.
విజయవాడ వెళ్లే దారిలో….
విచిత్రమేంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో భూముల ధరలు పెరగలేదు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కు సమీపంలో భూముల ధరలు పెరిగాయి. విజయవాడ వైపు ఐటీ పరిశ్రమలు లేకపోవడం వల్లనే భూముల ధరల్లో పెద్దగా మార్పు లేదు. అదే ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే విజయవాడ, విశాఖ పట్నంలో భూముల ధరలు పెద్దగా మార్పులు లేవన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న విషయం.
విశాఖతో పోల్చరేమి?
విశాఖపట్నంలో హైదరాబాద్ తో సమానంగా భూములు ధరలున్నాయని, విశాఖలో భూమిని కొనడం కంటే హైదరాబాద్ లో కొనడం సులువన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. విశాఖలో వాతావరణం, పరిశ్రమలు ఉండటంతోనే ధరలకు రెక్కలు వచ్చాయి. పరిపాలన రాజధాని కూడా వస్తుందని ప్రకటించడం, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం, మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే విశాఖలో భూములను కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు తెలంగాణలో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ భూమి ధరలు గురించి మాట్లాడారో చెబితే బాగుంటుదంటున్నారు. ఎందుకంటే అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో భూముల ధరలు పోల్చారేమోనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.