Goa : గోవా సెంటిమెంట్ ఈసారి కూడా నిజమవుతుందా?
ఇదో సెంటిమెంట్.. నిజమో కాదో తెలియదు కాని వచ్చే ఏడాది జరగనున్న గోవా ఎన్నికల్లో గెలిస్తే ఆల్ మోస్ట్ ఢిల్లీ పీఠం దక్కినట్లే. గోవాలో ప్రభుత్వం ఎవరు [more]
ఇదో సెంటిమెంట్.. నిజమో కాదో తెలియదు కాని వచ్చే ఏడాది జరగనున్న గోవా ఎన్నికల్లో గెలిస్తే ఆల్ మోస్ట్ ఢిల్లీ పీఠం దక్కినట్లే. గోవాలో ప్రభుత్వం ఎవరు [more]
ఇదో సెంటిమెంట్.. నిజమో కాదో తెలియదు కాని వచ్చే ఏడాది జరగనున్న గోవా ఎన్నికల్లో గెలిస్తే ఆల్ మోస్ట్ ఢిల్లీ పీఠం దక్కినట్లే. గోవాలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తే వారు ఢిల్లీలో అధికారంలోకి వస్తారన్న సెంటిమెంట్ ఉంది. దీంతో అన్ని పార్టీలూ గోవా రాష్ట్రంపై కన్నేశాయి. కాని ఇక్కడ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి పోటీ మాత్రం భిన్నంగా ఉండబోతుంది.
ఇదీ సెంటిమెంట్….
2007 ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్ విజయం సాధించగా 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే 2012లో గోవాలో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా 2014లో జరిగిన ఎన్నికల్లో గోవాలో గెలిచిన బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. 2017లో కాంగ్రెస్ గోవాలో 17 స్థానాలను సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించినా, 13 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ మిత్రపక్షాలతో కలసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 2019 ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
అందుకే గెలుపు కోసం….
ఈ సెంటిమెంట్ తో అన్ని పార్టీలు ఇక్కడ గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించనుంది. బీజేపీ కూడా తన శక్తియుక్తులన్నీ వినియోగించి ఈసారి కూడా గోవాలో గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ చిన్నాచితకా పార్టీలు కీలకంగా మారనున్నాయి. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీతో పాటు అనేక పార్టీలు జాతీయ పార్టీల వెెంట వెళ్తనున్నాయి.
ప్రాంతీయ పార్టీలన్నీ…..
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు కూడా బరిలోకి దిగనున్నాయి. ప్రధానంగా వీటివల్ల ప్రభుత్వ వ్యతరేక ఓటు చీలిపోతుందన్న ఆందోళన కాంగ్రెస్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో ప్రభావం చూపే అవకాశముంది. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గోవాలోనూ పోటీ చేసి తన పార్టీని జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని భావిస్తున్నారు. మరి ఈసారి గోవా సెంటిమెంట్ ఎలా పనిచేస్తుందనేది చూడాలి.
- Tags
- goa
- à°à±à°µà°¾