గోల్ కొట్టేశారుగా….!!
బీఎస్ యడ్యూరప్ప… కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ఎదురులేని నేత. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వరస విజయాలకు యడ్యూరప్ప కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే [more]
బీఎస్ యడ్యూరప్ప… కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ఎదురులేని నేత. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వరస విజయాలకు యడ్యూరప్ప కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే [more]
బీఎస్ యడ్యూరప్ప… కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ఎదురులేని నేత. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వరస విజయాలకు యడ్యూరప్ప కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే లింగాయత్ ల్లో బలమైన నాయకుడిగా ముద్రపడిన యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో బలోపేతం చేశారని చెప్పక తప్పదు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఎన్నాళ్లో వేచిన సమయం రానే వచ్చింది.
డెబ్బయి పదులు దాటినా….
కన్నడనాట సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కుమారస్వామి బలపరీక్షలో విశ్వాసం కోల్పోవడంతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకోనుంది. డెబ్బయి పదులు దాటిన యడ్యూరప్ప ఈ అవకాశం కోసం కాచుక్కూర్చున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప కు కేవలం ఎనిమిది అంకెతో అధికారం తప్పిపోయింది. అప్పటి నుంచి ఆయన చేయని ప్రయత్నాలు లేవు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి యడ్యూరప్ప ఆపరేషన్ కమల్ కు తెరదీశారు.
మూడు రోజులుకే దిగిపోయి….
ఎన్నికల ఫలితాలు రాగానే గత ఏడాది మే 16వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే శాసనభలో తగిన బలం లేకపోవడంతో మూడు రోజులకే అంటే మే 19వ తేదీన ఆయన పదవి నుంచి దిగిపోయారు. బలపరీక్షకు దిగకుండానే అధిష్టానం సూచనల మేరకు ఆయన మూడు రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ శాసనసభ్యులకు బీజేపీ వల విసురుతూనే ఉంది. రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు కూడా తరలించారు. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు.
ఈసారి పక్కాగా…..
కానీ ఈసారి పక్కాగా కమలం ఆపరేషన్ జరిగిందనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేయడంతో ప్రజల నాడి కూడా బీజేపీ వైపు ఉందని భావించిన అసంతృప్త ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు స్నేహహస్తం అందించారు. ఈసారి యడ్యూరప్ప ఆపరేషన్ ను చాపకింద నీరులా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 15మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించగలిగారంటే పకడ్బందీగా ఎంతగా ప్లాన్ అమలు చేశారో అర్థమవుతుంది. మొత్తం మీద యడ్యూరప్ప కల నెరవేరబోతోంది.మరో నాలుగేళ్ల పాటు కన్నడ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించేందుకు కమలం పార్టీ ఉవ్విళ్లూరుతుంది.