“తోట”కు మాలి ఎవరో…?
తెలుగుదేశం పార్టీ నుంచి మరో బిగ్ వికెట్ పడనుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళుతున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతుంది. ఓటమి [more]
తెలుగుదేశం పార్టీ నుంచి మరో బిగ్ వికెట్ పడనుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళుతున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతుంది. ఓటమి [more]
తెలుగుదేశం పార్టీ నుంచి మరో బిగ్ వికెట్ పడనుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళుతున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతుంది. ఓటమి పాలయిన వారితో పాటు గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని నేతలు సయితం టీడీపీని వీడి పోవాలని చూస్తున్నారు. ఇక తాజాగా తోట త్రిమూర్తులు టీడీపీని వీడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆయన తరచూ కాపు సామాజికవ ర్గం నేతలతో సమావేశమవుతుండటం ఈ అనుమానాలకు మరింత బలమిస్తోంది.
పట్టున్న వ్యక్తి కావడంతో….
తోట త్రిమూర్తులు గట్టి పట్టున్న వ్యక్తి. ఆయన నియోజకవర్గమైన రామచంద్రపురంలో కులాలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. అయితే తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ విడివిడిగా పోటీ చేయడంతో తోట త్రిమూర్తులు తన సామాజికవర్గం ఓట్లను పొందలేక ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు నుంచే తోట త్రిమూర్తులు టీడీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
పార్టీలన్నీ ఆయన చుట్టూనే…..
తోట త్రిమూర్తులు వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నేత కావడంతో సహజంగానే ఆయన చుట్టూ పార్టీలు తిరుగుతుంటాయి. అలాగే ఆయన కూడా ఏ పార్టీకి వెళ్లాలన్నా డోర్లు తెరిచే ఉంటాయి. తోట త్రిమూర్తులు ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మరొకసారి కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలిచారు. ఆయన వైసీపీలోకి వెళ్లాలనుకున్నా అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవు.
ఏదో ఒక పార్టీలో…..
నిజానికి తోట త్రిమూర్తులుకు ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది. అయితే రామచంద్రాపురంతో పాటు తన కుమారుడికి కాకినాడ రూరల్ టిక్కెట్ కూడా తోట త్రిమూర్తులు అడగటంతో జగన్ నో చెప్పారు. దీంతో తోట త్రిమూర్తులు అయిష్టంగానే టీడీపీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఓటమితో తోట త్రిమూర్తులు పూర్తిగా డీలా పడిపోయారు. ఆయన తాజాగా తన సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అది సాధ్యం కాకుంటే బీజేపీలోకైనా వెళ్లాలన్నది తోట త్రిమూర్తుల ఆలోచనగా ఉంది.