వైసీపీలోనే తోటను టార్గెట్ చేస్తోందెవరు ?
ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని పొందిన వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులును టార్గెట్ చేస్తూ ఇటీవల దుమారం రేగిన విషయం తెలిసిందే. సీఎం జగన్.. తోట [more]
ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని పొందిన వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులును టార్గెట్ చేస్తూ ఇటీవల దుమారం రేగిన విషయం తెలిసిందే. సీఎం జగన్.. తోట [more]
ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని పొందిన వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులును టార్గెట్ చేస్తూ ఇటీవల దుమారం రేగిన విషయం తెలిసిందే. సీఎం జగన్.. తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తూ సిఫారసు చేయగానే.. పెద్ద ఎత్తున వివాదం తెరమీదికి వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిపక్ష నేతలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి.. ఎస్సీ ద్రోహి.. అలాంటి నేతకు మండలి పదవి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో ఎస్సీ వ్యక్తి శిరోముండనం తాలూకు పేపర్ కటింగులను కొందరు ప్రదర్శించారు. వాస్తవంగా చూస్తే తోట త్రిమూర్తులపై ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం ఓ ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేయించారన్న కేసు ఉంది. ఇది ఆయన్ను ఈ రెండున్నర దశాబ్దాలుగా చాలాసార్లు ఇబ్బంది పెడుతూ వస్తోంది.
సొంత నియోజకవర్గంలో….
తాజాగా తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీకి నామినేట్ కావడంతో మరోసారి ఈ వివాదం ప్రత్యర్థులకు విమర్శనాస్త్రంగా మారింది. తోట సొంత నియోజకవర్గం అయిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోనూ కొందరు నేతలు.. ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే.. పైకి మాట్లాడింది.. మాత్రం ప్రతిపక్ష నేతలే అయినప్పటికీ.. దీని వెనుక.. వైసీపీ కీలక నేతలు ఉన్నారని గుసగుస వినిపిస్తోంది. అందులోనూ ఒక మంత్రి కూడా ఉన్నారని.. వైసీపీలోని ఓ వర్గం చర్చించుకోవడం గమనార్హం. ఆది నుంచి వివాదాలకు తోట కేంద్రంగా ఉన్నారని.. అలాంటి నేతకు ఎమ్మెల్సీ ఎందుకని వైసీపీలోనూ ఓ వర్గం (మంత్రిని సమర్ధించే) ఆఫ్‌ది రికార్డుగా మీడియాతో చెప్పడం కూడా గమనార్హం.
ఇద్దరు ఇప్పటికీ శత్రువులుగానే…..
రామచంద్రాపురం నియోజకవర్గంలో గ్రూపుల గోల మామూలుగా లేదు. రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్, మంత్రి చెల్లుబోయిన వేణుతో తోట త్రిమూర్తులుకు ఏ మాత్రం పొసగదు. వీరిలో బోస్ అయితే తోటకు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయ శత్రువు. వేణు గత ఎన్నికల్లో తోట త్రిమూర్తులును ఓడించారు. తోట ప్రస్తుతం మండపేట ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన్ను రామచంద్రాపురం రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకు బోస్, వేణు మామూలు ప్రయత్నాలు చేయడం లేదు.
రాబోయే రోజుల్లో…..
అయితే తోట త్రిమూర్తులు విషయంలో ప్రత్యర్థులు విమర్శలు నిలబడకపోయినా.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు.. వివాదాలు.. అన్నీ కూడా జిల్లా రాజకీయాల పై ప్రభావం చూపుతాయని.. ఇప్పుడు సైలెంట్ అయినప్పటికీ.. తోట త్రిమూర్తులు ప్రస్తుత పరిణామాల ను సీరియస్‌గానే తీసుకున్నారని.. ఎట్టిపరిస్థితిలోనూ వీటిని ఆయన వదిలిపెట్టరని ఆయన వర్గం చెపుతోంది. రాబోయే రోజుల్లో మరింత ఆధిపత్య ధోరణితో వైసీపీ రాజకీయాలు కొనసాగే అవకాశం ఉంటుందన్నది నిజం.