ముద్రగడ వారసురాలయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా?
ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ల ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఆయన అనుచరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ముద్రగడ ససేమిరా అంటున్నారు. తాను ఉద్యమం నిర్వహించలేనని, తనను సొంత [more]
ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ల ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఆయన అనుచరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ముద్రగడ ససేమిరా అంటున్నారు. తాను ఉద్యమం నిర్వహించలేనని, తనను సొంత [more]
ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ల ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఆయన అనుచరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ముద్రగడ ససేమిరా అంటున్నారు. తాను ఉద్యమం నిర్వహించలేనని, తనను సొంత సామాజికవర్గం వారే టార్గెట్ చేశారని ఆయన తనను కలవడానికి వచ్చిన వారి ఎదుట ఆవేదన చెందుతున్నారు. అయితే ఇదేసమయంలో ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తలకెత్తుకునేందుకు తోట వాణి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని…..
ముద్రగడ పద్మనాభం బ్రేక్ తీసుకుంటారు. ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నానని ప్రకటించడంతో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు తోట వాణి ప్రయత్నిస్తున్నారన్న చర్చ ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతోంది. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తాను భుజానికెత్తుకుంటానని తోట వాణి సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె కాపు నేతలకు కూడా కబురు పంపారని తెలుస్తోంది.
రాజకీయంగా….
నిజానికి తోట వాణి గత ఎన్నికలకు ముందు వరకూ టీడీపీలో ఉన్నారు. తోట నరసింహం ఎమ్మెల్యే టిక్కెట్ కోరినా చంద్రబాబు ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో వైసీపీ లోచేరారు. తోట నరసింహం ఆరోగ్యం బాగా లేకపోవడంతో తోట వాణికి జగన్ పెద్దాపురం టిక్కెట్ ఇచ్చారు. అయితే తోట వాణి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిన రాజప్ప పై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తోట వాణి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తోట వాణి బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది.
వైసీపీకి రాజీనామా చేసి…..
తోట వాణి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె. తండ్రి, భర్తకు కాపు సామాజికవర్గంలో ఉన్న ఆదరణ తనను రాజకీయంగా ఎదిగేలా చేస్తుందనుకున్నారు. అయితే ఓటమి తర్వాత తోట వాణి కుటుంబాన్ని పార్టీ పట్టించుకోక పోవడంతో ఆమె కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తాను నడపాలని భావిస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ముద్రగడ చేతుల్లో నుంచి ఉద్యమాన్ని తీసుకుని ఆమె సమర్థవంతంగా నడపలగలరా? అన్న చర్చ జరుగుతోంది. తోట వాణి త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి కాపు ఉద్యమంలోకి దిగుతారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.