మళ్లీ వ్యతిరేకిస్తారు… వీళ్లేం చేస్తారు?
జగన్ వినరు. తాను అనుకున్నదే చేస్తారు. మరోసారి మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదింప చేసుకున్నారు. తిరిగి ఈరోజు శాసనమండలికి పంపనున్నారు. శాసనమండలిలో తిరిగి వ్యతిరేకించాలని టీడీపీ [more]
జగన్ వినరు. తాను అనుకున్నదే చేస్తారు. మరోసారి మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదింప చేసుకున్నారు. తిరిగి ఈరోజు శాసనమండలికి పంపనున్నారు. శాసనమండలిలో తిరిగి వ్యతిరేకించాలని టీడీపీ [more]
జగన్ వినరు. తాను అనుకున్నదే చేస్తారు. మరోసారి మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదింప చేసుకున్నారు. తిరిగి ఈరోజు శాసనమండలికి పంపనున్నారు. శాసనమండలిలో తిరిగి వ్యతిరేకించాలని టీడీపీ భావిస్తుంది. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకుంటే మరోసారి ఎలా శాసనసభలో ఆమోదిస్తారని టీడీపీ ప్రశ్నిస్తుంది. మరోసారి తాము అడ్డుకుంటామని చెబుతోంది.
మూడు రాజధానుల ప్రతిపాదన….
జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఈ ఏడాది జనవరి నెలలో శాసనసభలో ప్రవేశపెట్టారు. విశాఖను పరిపాలనా రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయరాజధానిగా కర్నూలును చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే శాసనమండలిలో టీడీపీ సభ్యులు బలం ఎక్కువగా ఉండటంతో దీనిని సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ వాదిస్తుంది.
మండలిలో సెలెక్ట్ కమిటీకి…..
శానసమండలి నియామవళిని ఉల్లంఘించిందని, శానసమండలి ఛైర్మన్ కు ముందస్తు నోటీసులు పంపకుండా సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీకి తమ సభ్యుల పేర్లను కూడా వైసీపీ పంపలేదు. దీంతో ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు శాసనమండలిలో పెండింగ్ లో ఉన్నాయి. మండలిలో పెండింగ్ లో ఉన్న సమయంలో ఎలా మళ్లీ శాసనసభలో ప్రవేశపెడతారని టీడీపీ అడుగుతోంది.
వ్యతిరేకిస్తే ఏమవుతుంది?
ఈరోజు శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం మళ్లీ ఈ బిల్లును వ్యతిరేకించనుంది. సెలెక్ట్ కమిటీకి పంపకుండా బిల్లును వ్యతిరేకిస్తు ప్రభుత్వానికి అడ్వాంటేజీగా మారనుంది. తిరిగి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకునే వీలు ప్రభుత్వానికి ఉందంటున్నారు. మొత్తం మీద శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు ఈరోజు రానుండంటంతో ఉత్కంఠ రేపుతోంది.