టీడీపీని ముంచేస్తున్న ఆ ముగ్గురు నేతలు
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీ పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నేతలు ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది.. [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీ పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నేతలు ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది.. [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీ పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నేతలు ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది.. పార్టీ అభివృద్ధి కంటే కూడా.. తాము సొంతగా ఎదిగేందుకు గ్రూపు రాజకీయాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది వాస్తవం. వారు గ్రూపు మెయింటైన్ చేయకపోతే వారు పార్టీలో ఎక్కువ అవుట్ డేటెడ్ అయిపోతామో అన్న భయంతో గ్రూపులు పెంచి పోషిస్తూ తాము ఎదిగేందుకు పార్టీని నాశనం చేసేందుకు కూడా వెనుకాడరు. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరికి చెందిన ముగ్గురు టీడీపీ సీనియర్లు.. జిల్లాలో టీడీపీని తమ స్వార్థం కోసం అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. తాము ఎలాగూ.. పట్టు కోల్పోయినా.. పార్టీని ఎదిగేలా చేసేందుకు యువతను ప్రోత్సహించాలనే ఆలోచన కూడా చేయడం లేదని విమర్శలు వస్తుండడం గమనార్హం.
ఈ ముగ్గురు నేతలు…..
విషయంలోకి వెళ్తే.. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు.. పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప, ఎమ్మెల్సీ ట్రిపుల్ వీ చౌదరి (వట్టికూటి వీర వెంకన్న చౌదరి)లు జిల్లాలో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి ఎవరు రావాలన్నా కూడా.. ఈ ముగ్గురికీ కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. అంతేకాదు.. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఈ వృద్ధ నేతలు.. చంద్రబాబు చెవిలో జోరీగల్లా చేరి.. ఒకే రొదను వినిపిస్తున్నారని.. వారు చెప్పిందే చంద్రబాబు వింటున్నారని.. అంటున్నారు. అంతే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చంద్రబాబు కూడా గమనించడం లేదని చెబుతున్నారు.
రాజప్ప జోక్యంతో…..
వీరి దెబ్బతో కొత్తనాయకులు ఎవరూ పార్టీలోకి రావడం లేదు. పోనీ.. ఈ ముగ్గురికి ఏమైనా పట్టుందా ? అంటే.. అది కూడా లేదు. తునిలో యనమల ఫెయిల్ అయ్యారు. వరుస పరాజయాలతో ఆయన కుటుంబం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. యనమల రాజకీయ జీవితానికి దాదాపు తెరపడినట్టే. ఇక, చిన్నరాజప్ప తాను గెలిచిన పెద్దాపురం వరకు పరిమితమై రాజకీయం చేసుకుంటే బెటర్. కానీ, ఆయన అన్ని విషయాల్లోనూ వేలు పెడుతున్నారు. ముఖ్యంగా కోనసీమలో పలు నియోజకవర్గాల్లో రాజప్ప జోక్యం పెరిగిపోవడంతో ఇక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చే ఔత్సాహికులు, ఎన్నారైలు భయపడుతోన్న పరిస్థితి.
ఆఫీసులో కూర్చుని…..
ఇక,అవ్వకవ్వక ఎమ్మెల్సీ అయిన.. ట్రిపుల్ వీ చౌదరి.. లేనిపోని విషయాలను కలుగజేసుకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని.. రిపోర్టులు అవి ఇవీ అంటూ బాగానే గుంజేశారట. జిలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. కొత్త నేతలను ఎంకరేజ్ చేయాల్సిన ఈ వృద్ధ నేతలే తమ రాజకీయ ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందో అన్న భయంతో కొంత… కప్పాల పేరుతో వీరిని భయపెడుతుండడంతో ఎవ్వరూ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు.
గోదారిలో కలసి పోతున్నా…..
ఈ పరిస్థితి మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి తూర్పు టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాండెట్లు దొరకని పరిస్థితి. వీరికన్నా…. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అయితే.. బెటర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన చెప్పిన మాట చంద్రబాబు వినిపించుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ ముగ్గురు వృద్ధ నేతలే.. ప్రధాన సారథులుగా మారి.. జిల్లాలో పార్టీని గోదావరిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో ? చూడాలి.