శాపంగా మారిందే
పాత రోత కొత్త వింత లాగా మారింది నేటి సమాజం. టిక్ టాక్ యాప్ ఇప్పుడు అందరి కొంప అడ్డంగా ముంచేస్తుంది. భార్యా భర్తల కాపురాల్లో చిచ్చు [more]
పాత రోత కొత్త వింత లాగా మారింది నేటి సమాజం. టిక్ టాక్ యాప్ ఇప్పుడు అందరి కొంప అడ్డంగా ముంచేస్తుంది. భార్యా భర్తల కాపురాల్లో చిచ్చు [more]
పాత రోత కొత్త వింత లాగా మారింది నేటి సమాజం. టిక్ టాక్ యాప్ ఇప్పుడు అందరి కొంప అడ్డంగా ముంచేస్తుంది. భార్యా భర్తల కాపురాల్లో చిచ్చు పెట్టడం, ప్రేయసి ప్రియులను ఎడమొహం పెడమొహం చేయడం, విద్యా సంస్థలనుంచి విద్యార్థులకు టిసి లు ఇచ్చే వరకు దీని ఎఫెక్ట్ నిన్నమొన్నటివరకు సాగింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పాలిట కూడా టిక్ టాక్ యాప్ శాపంగా మారిపోయింది. రాత్రికి రాత్రి సోషల్ స్టార్స్ అయిపోయిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎవరు బడితే వారు టిక్ టాక్ లో ఊగిపోతూ వున్న ఉద్యోగాలు ఊడగొట్టేసుకునే సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో అందరికి వినోదం మాట ఎలా వున్నా వీటిని తమ పిల్లలు వినియోగించి ఏమౌతారన్న ఆందోళన తల్లితండ్రుల్లో వ్యక్తం అవుతుంది.
శిక్షణ ముగియకుండానే …
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో శిక్షణ కోసం వచ్చిన ఇద్దరు విద్యార్థులు విధి నిర్వహణలో టిక్ టాక్ వారికే కాదు వారిని పంపిన విద్యాసంస్థలకు షాక్ ఇచ్చేలా చేసింది. వీరిపై చర్య తీసుకున్న గాంధీ ఆసుపత్రి వీరిని పంపి తమ ప్రభుత్వ సంస్థ పరువు తీశారంటూ రెండు విద్యా సంస్థల అప్లియేషన్ రద్దు చేసేసింది. ఇక మద్యం సేవించి టిక్ టాక్ చేసిన సెక్యూరిటీ సిబ్బందికి ఉద్వాసన తప్పలేదు. ఇక కరీంనగర్ లో డిఎమ్ అండ్ హెచ్ ఓ లోని హెల్త్ అసిస్టెంట్ లు ఇద్దరు అటెండర్ టిక్ టాక్ చేసి వైరల్ అయిపోయారు. ఇప్పుడు వీరి ఉద్యోగాలు రిస్క్ లో పడ్డాయి. ఇక విశాఖ శక్తి టీం కి చెందిన మహిళా కానిస్టేబుల్స్ పోలీస్ వాహనంలో చేసిన టిక్ టాక్ వైరల్ అయ్యింది. ఆకతాయిల పని పట్టాలిసిన వీరు అది వదిలేసి ఈ పిచ్చి లో పడటం ఏమిటంటూ నెటిజెన్స్ తిట్టిపోస్తున్నారు వీరిని. వీరిపై కూడా శాఖాపరంగా చర్యలు తప్పేలా లేవు.
వేలం వెర్రిగా ….
టిక్ టాక్ ఇప్పుడు వేలంవెర్రిగా మారిపోయింది. చిన్నారులనుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ యాప్ కి బానిసల్లా మారిపోతుండటం ఆందోళనకర పరిణామం. ఇదో రకమైన మానసిక రుగ్మత గా తయారైపోతుందని సైకాలజిస్ట్ లు సైతం హెచ్చరికలు చేస్తున్నారు. టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ బయటపెట్టి ఒక్క పెర్ ఫార్మెన్స్ తో సెలబ్రిటీ కావాలన్న పిచ్చి చాలామందిలో ఉంటే మరికొందరు దీన్నో వ్యసనంగా మార్చుకున్నారు. ఇందులో వారు వీరు పడి కాలం వృధా చేసుకోవడం సంగతి ఎలా వున్నా విద్యార్థులు, ఉద్యోగులు మాత్రం తమ కెరియర్ ను ఫణంగా పెట్టి ఆడుకోవడాన్ని ఎలా నిరోధించాలో ఇప్పుడు ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా వుంది.