తిరుపతి అందరినీ కలిపిందా?
తిరుపతి ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అప్పటి వరకూ అంటీ ముట్టనట్లు ఉన్న నేతలు అందరూ ఒక్కటయ్యారు. పార్టీ విజయం కోసం [more]
తిరుపతి ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అప్పటి వరకూ అంటీ ముట్టనట్లు ఉన్న నేతలు అందరూ ఒక్కటయ్యారు. పార్టీ విజయం కోసం [more]
తిరుపతి ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అప్పటి వరకూ అంటీ ముట్టనట్లు ఉన్న నేతలు అందరూ ఒక్కటయ్యారు. పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేశారు. ఒక్క విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మినహా దాదాపు నేతలందరూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటముల పరిస్థితి పక్కన పెడితే తిరుపతి ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ నేతలందరినీ ఒక్కటి చేసిందని చెప్పాలి.
బాబు నిర్ణయంతో…
రెండేళ్లవుతున్నా తెలుగుదేశం పార్టీ ఎలాంటి జోష్ కన్పించలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కూడా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు వేరే సాకులు చెప్పినప్పటికీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చింది. చంద్రబాబు నిర్ణయం టీడీపీ నేతలను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఎన్నికల బహిష్కరణ వంటి సంచలన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారంటే తమ పై ఉన్న అసంతృప్తి కూడా ఒక కారణమని టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు.
నెల రోజులు అచ్చెన్న…..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దాదాపు నెల రోజులు తిరుపతిలోనే మకాం వేశారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సునీల్ కుమార్, బొజ్జల సుధీర్, సుగుణమ్మ వంటి నేతలు కష్టపడి పనిచేశారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలు సయితం తిరుపతిని వదలలేదంటే వారి కసిని అర్థం చేసుకోవచ్చు. పరిటాల శ్రీరాం, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ వంటి నేతలు కూడా రంగంలోకి దిగారు.
బాబు వారం రోజులు…..
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాదాపు వారం రోజులు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఏడు నియోజకవర్గాల్లోనూ ఆయన రోడ్ షోలలో పాల్గొన్నారు. నారా లోకేష్ సయితం దాదాపు పదిహేను రోజుల పాటు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తమ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మాట అటుంచితే అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిందనే చెప్పాలి.