కొత్త పంథా లో గులాబీ బాస్
రాజకీయ పార్టీలు పదికాలాలు జనంలో ఉండాలి అంటే పునాది బలంగా పడాలి. ఇప్పటివరకు వందేళ్ళకు పైబడిన కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ మరే ప్రాంతీయ పార్టీలకు లేని [more]
రాజకీయ పార్టీలు పదికాలాలు జనంలో ఉండాలి అంటే పునాది బలంగా పడాలి. ఇప్పటివరకు వందేళ్ళకు పైబడిన కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ మరే ప్రాంతీయ పార్టీలకు లేని [more]
రాజకీయ పార్టీలు పదికాలాలు జనంలో ఉండాలి అంటే పునాది బలంగా పడాలి. ఇప్పటివరకు వందేళ్ళకు పైబడిన కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ మరే ప్రాంతీయ పార్టీలకు లేని జిల్లాల వారీ సొంత కార్యాలయాలు ఇప్పుడు గులాబీ దండు తెలంగాణ లో నిర్మించనుండటం ఒక రికార్డే. తద్వారా పార్టీ క్యాడర్ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాలు దోహద పడనున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి, పార్టీ కార్యకలాపాలు వేగంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలు గణనీయంగా తగ్గు ముఖం పడతాయి. తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచే చర్యలకు ఇప్పటినుంచి పునాదులు పటిష్టంగా వేస్తున్నారు.
అంతా కొత్త కొత్తగా …
తెలంగాణా రూపురేఖలు మార్చేందుకు కెసిఆర్ నడుం బిగించారు. ఇప్పుడు ఆయన రెండు రకాల ప్లాన్స్ తో వెళుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం చర్యలు అన్ని కొత్తగా ఉండాలి. మరో పక్క అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయాలు నిర్మించడం తో అటు పాలన ఇటు పార్టీ రెండింటిని సమ ప్రాధాన్యత కల్పించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం తిరిగి భవిష్యత్తులో ఎదురు కాకుండా చూసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. పార్టీ వ్యవహారం పూర్తిగా తన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై వదిలేయకుండా తన పర్యవేక్షణ అవసరమని గులాబీ చీఫ్ ఆలోచనగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. తమది కుటుంబ పాలన అని తరచూ ప్రత్యర్ధులు చేసే విమర్శలకు చెక్ పెట్టేందుకే ఇప్పటికే హరీష్ రావు, కెటిఆర్ లకు మంత్రి పదవుల కు దూరం పెట్టారు కెసిఆర్.సచివాలయం, అసెంబ్లీ లను కొత్తగా నిర్మించి పాత వాసనలను తుడిచివేయడానికి గులాబీ బాస్ శ్రీకారం చుడుతున్నారు. మరి కెసిఆర్ కొత్త ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.