వైఎస్ ను ఇంకా వాడుకుందామనేనా…?
కాలం గొప్పది. దాని కంటే తీర్పరి, నేర్పరి ఎవరూ ఉండరు. అసలైన న్యాయమూర్తి కాలమే. వర్తమానంలోనూ, బతికి ఉన్నపుడూ ఎవరైన గొప్ప వాడివే అని కీర్తిస్తారు. కానీ [more]
కాలం గొప్పది. దాని కంటే తీర్పరి, నేర్పరి ఎవరూ ఉండరు. అసలైన న్యాయమూర్తి కాలమే. వర్తమానంలోనూ, బతికి ఉన్నపుడూ ఎవరైన గొప్ప వాడివే అని కీర్తిస్తారు. కానీ [more]
కాలం గొప్పది. దాని కంటే తీర్పరి, నేర్పరి ఎవరూ ఉండరు. అసలైన న్యాయమూర్తి కాలమే. వర్తమానంలోనూ, బతికి ఉన్నపుడూ ఎవరైన గొప్ప వాడివే అని కీర్తిస్తారు. కానీ మరణించాక కూడా ఆ మనిషిని ఇంకా తలచుకుంటున్నారు అంటే నిజంగా ఆ జన్మ ఎంత గొప్పదో కదా. ఇదంతా ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి. ఆయన పోయి పుష్కర కాలం గడచింది. కానీ మాట వస్తే చాలు ఆయన్ని రాజకీయాల్లో తలచుకుంటారు. ఆయన కుమారుడు జగన్ తండ్రి పేరు మీదనే పార్టీ పెట్టి ఏపీలో వైఎస్సార్ ని కొలువు ఉండేలా చేశారు. ఇక తెలంగాణాలో మంచికో చెడ్డకో ఆయన ప్రస్థావన తరచుగా వస్తూనే ఉంది.
దాని అర్ధం ఏంటి …?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తెలంగాణాను రానిచ్చేవారు కాదంటూ టీయారెస్ నాయకులు తాజాగా నిప్పులు చెరిగారు. వారు ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలు అన్నా కూడా ఏపీ జనంలో ఉన్న భావన కూడా అదే. ఆ మాటకు వస్తే తెలంగాణాలో కూడా చాలా మందికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరాధ్యుడు. ఆయన మీద వారికి ప్రేమే ఉంది తప్ప రాజకీయ ద్వేషం లేదు. అయితే ఒక రాజకీయ పార్టీగా టీయారెస్ వైఎస్సార్ ని విమర్శిస్తుందే తప్ప ఎందుకు పొగుడుతుంది. అయితే ఆ విమర్శలలో కూడా అక్షర సత్యాలు ఉన్నాయి. లక్షల విలువ చేసే ఆణిముత్యాలు ఉన్నాయి. వాటినే ఏరుకుంటున్నారు ఆంధ్రులు.
నిలువూ అడ్డమూ…
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు తాను నిలువూ అడ్డమూ కాదని ముఖ్యమంత్రిగా పదే పదే చెప్పుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే నిజమని కూడా ఆచరణలో చెప్పేశారు. అవును ఆయన మొత్తం తెలుగు ప్రజా పక్షంగానే నిలిచారు. అభివృద్ధిని చూపిస్తే ఎక్కడ అయినా ఎందుకు వేర్పాటు వాదాలు పుడతాయి అన్నదే ఆయన ఫిలాసఫీ. అందుకే ఆయన ఒక వైపు ఏపీకి పోలవరం వరంగా ఇస్తూ జల యజ్ణం పేరుతో మొత్తం ఉమ్మడి ఏపీలో అనేక నీటి ప్రాజెక్టులకు ఊపిరిలూదారు. ఇక ఆయన రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే తపన పడేవారు. ఒక విధంగా ఆయన కేంద్రానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి అడ్డంగానే నిలిచి మరీ తెలంగాణాను ఆపారు. ఇపుడు అదే టీయారెస్ నేతలు చెబుతున్నారు కూడా.
ఇంకా దగ్గరగా….?
విభజన జరిగి ఏడేళ్ళు గడిచినా ఇంకా కోలుకోలేదు ఏపీ జనం. లోటు బడ్జెట్, అప్పుల కుప్ప రాష్ట్రం. భవిష్యత్తు అంధకారం. ఇలాంటి పరిస్థితుల్లో వారు మనసులో ఎన్ని సార్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని తలచుకుని ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ ఉంటే కనుక విభజన జరిగి ఉండేది కాదు అన్నది ప్రతీ ఒక్క ఆంధ్రుడి గట్టి నమ్మకం. ఆ మాటకు వస్తే పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరి మాట కూడా అదే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా ఈ లోకం నుంచి తప్పుకోవడంతోనే ఏపీ రెండు ముక్కలు అయిందని అంతా అంగీకరిస్తారు. ఇపుడు అవే విమర్శలు చేస్తున్న టీయారెస్ పెద్దలు సత్యమే పలికారని అంతా ఒప్పుకుంటున్నారు. మరి తెలంగాణాలో టీయారెస్ నేతలకి వైఎస్సార్ రాక్షసుడు అయితే కావచ్చేమో కానీ ఏపీ జనాలకు, ఇంకా చెప్పాలంటే అభివృద్ధి కోరుకునే మొత్తం తెలుగు జనాలకు ఆయన ఎప్పటికీ దేవుడే సుమా.